ట్రంప్ సర్కారుకు షాక్
Breaking News
నోరు అదుపులో పెట్టుకో.. వాడు, వీడు ఏంది? శ్రీహాన్ ఫైర్
Published on Tue, 09/20/2022 - 15:15
బిగ్‌బాస్ సీజన్-6లో ఈవారం కెప్టెన్సీ పోటీదారుల కోసం అడవిలో ఆట అనే టాస్క్‌ని నిర్వహించాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా కొంతమంది ఇంటిసభ్యులు పోలీసులుగా, మరికొందరు దొంగలుగా వ్యవహరిస్తారు. అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలిగా గీతూ వ్యహరిస్తుంది. అయితే ఈ టాస్కులో కూడా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం నడిచినట్లు అర్థమవుతుంది. దొంగలు-పోలీసులకు మధ్య జరిగిన గొడవలో ఆరోహి కిందపడి గాయాలపాలవుతుంది.
దీనికి శ్రీహీన్‌ను నిందిస్తుంది ఇనయా. వాడే కాలుపట్టి లాగాడంటూ పక్కనున్న కంటెసస్టెంట్లకు చెబుతుండగా, శ్రీహాన్ వచ్చి.. నోరు అదుపులో పెట్టుకో వాడు, వీడు ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఫైర్ అవుతాడు. రేవంత్‌ను కూడా ఇనయా ఇదే విషయంలో వాదనకు దిగుతుంది. వాడు ఏంటి వాడు? మీ ఇంట్లో మ్యానర్స్ నేర్పలేదా అంటూ రేవంత్ ఆమెపై ఫైర్ అవుతాడు. మరి నిజానికి ఇందులో తప్పు ఎవరిది అన్నది ఎపిసోడ్‌లో పూర్తి క్లారిటీ రానుంది.
Tags : 1