Breaking News

బిగ్‌ బాస్‌లోకి యూట్యూబర్లు,ఇన్‌ఫ్లుయన్సెర్లకు ఇక నో ఎంట్రీ...

Published on Wed, 06/04/2025 - 13:36

ఎక్కడో ఇంగ్లండ్‌లో పుట్టి ఓ హీరోయిన్‌ ద్వారా ఇండియాలో అడుగు పెట్టి అన్ని ప్రధాన భాషల్లోనూ వీర విహారం చేస్తోంది ఆ షో. ఇంగ్లండ్‌ మూలాలు కలిగిన బిగ్‌బాస్‌(Bigg Boss 19) గురించి తెలియనివారు ఉండరు. గత కొన్నేళ్లుగా తెలుగు నాట అనేక రకాల వివాదాలకు విమర్శలకు విజయాలకు చిరునామాగా మారింది ఈ  బిగ్‌ బాస్‌.ఈ షో కొత్త కొత్త సెలబ్రిటీలను తెరమీదకు తెచ్చింది. మరీ ముఖ్యంగా యూ ట్యూబ్, ఇన్‌స్టా గ్రామ్‌ వంటి వేదికల ద్వారా పేరొందిన సోషల్‌ మీడియా సెలబ్రిటీలకు సరికొత్త పాప్యులరారిటీని అందించింది.

డ్యాన్స్, పాటల వీడియోలతో తొలినాళ్లలో సోషల్‌ సెలబ్రిటీగా పేరొందిన దీప్తి సునయన,  మై విలేజ్‌ షో ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ, టిక్‌ టాక్‌ వీడియోలతో జూనియర్‌ సమంతగా పాప్యులరైన అషూరెడ్డి, యూట్యూబ్, ఇన్‌స్టా స్టార్‌ షణ్ముఖ్‌ జస్వంత్, ఇన్‌స్టా గ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరొందిన గీతూరాయల్, కామెడీ కంటెంట్‌తో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన బెజవాడ బేబక్క,7 ఆర్ట్స్‌ యూ ట్యూబ్‌ చానెల్‌ ద్వారా ప్రసిద్ధి పొందిన  కిర్రాక్‌ సీత, రేడియో జాకీగా పేరొందిన ఆర్‌జె కాజల్,  ఇంకా అలాంటి అనేక మంది ఇప్పటికే తమ సోషల్‌ స్టేటస్‌కు బిగ్‌ బాస్‌ ద్వారా మరింత గ్లామర్‌ను జత చేసుకున్నారు అనేది తెలిసిందే.

ఈ నేపధ్యంలో బిగ్‌ బాస్‌  కొత్త సీజన్‌ ప్రారంభం అవుతోందనగానే సోషల్‌ మీడియా సెలబ్రిటీలు అప్రమత్తం అయిపోవడం, హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టడం సర్వ సాధారణంగా మారిపోయింది. అదే విధంగా బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వీరు వెళతారు వారు వెళ్లనున్నారు అంటూ సీజన్‌ మొదలయ్యే దాకా పుకార్లు షికార్లు చేయడమూ రివాజుగా మారింది.

అయితే భవిష్యత్తులో వీరి ఆశలు నీరుగారనున్నాయా? ఇకపై బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి సోషల్‌ మీడియా సెలబ్రిటీలకు నో ఎంట్రీ బోర్డు దర్శనమివ్వనుందా? ఇలాంటి సందేహాలు వచ్చేలా చేస్తున్నాయి కొన్ని తాజా నిర్ణయాలు,  తాజా పరిణామాలు. ప్రస్తుతానికి తెలుగు బిగ్‌ బాస్‌కు సంబంధించినవి కాకపోయినా...  ప్రాంతీయ బిగ్‌బాస్‌లు అన్నింటికీ పెద్దన్న లాంటి హిందీ బిగ్‌ బాస్‌ కు సంబంధించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని సమాచారం.

హిందీలో బాలీవుడ్‌ దిగ్గజం సల్మాన్‌ఖాన్‌ సమర్పిస్తున్న బిగ్‌ బాస్‌ 19  గురించి వినిపిస్తోన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సీజన్‌ కోసం మేకర్స్‌ గణనీయమైన ఫార్మాట్‌ మార్పును ప్లాన్‌ చేస్తున్నారు. గత సంవత్సరాలకు భిన్నంగా, రాబోయే రియాలిటీ షోలో యూ ట్యూబర్లు లేదా సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇక ఉండరని సమాచారం. బదులుగా, పోటీదారుల్లో పేరొందిన,  స్థిరపడిన  బాలీవుడ్‌ టీవీ రంగ ప్రముఖులు మాత్రమే ఉంటారు.

టెల్లీ రిపోర్టర్‌ నివేదిక ప్రకారం, బిగ్‌ బాస్‌ 19 నిర్మాతలు సాంప్రదాయ వినోద పరిశ్రమల నుంచి ప్రసిద్ధి చెందిన పేర్లపై మాత్రమే దృష్టి సారించి, షోను దాని మూలాల వైపునకు నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ షోకు మరింత సాంప్రదాయ గ్లామర్‌ అప్పీల్‌ ఇవ్వడం ద్వారా ప్రారంభకాలం  నాటి సెలబ్రిటీ–కేంద్రీకృత ఫార్మాట్‌కు తిరిగి రావడమే లక్ష్యం గా పెట్టుకున్నారని, అందుకే  ప్రధాన స్రవంతి నటుల మీదే దృష్టి సారించి బిగ్‌ బాస్‌ అసలు సారాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్లు,  విస్త్రుత అభిమానుల స్థాయితో వ్యూహాత్మక గేమ్‌ప్లేతో కొత్త యువ ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపగలిగారనేది నిజం. సోషల్‌ మీడియా సెలబ్రిటీల వల్ల  వీక్షకుల సంఖ్య పెరిగారనేది నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే వీరి వల్ల షో తన అసలు స్వరూపాన్ని కోల్పోతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా సల్మాన్‌ బిగ్‌బాస్‌ ఈ కొత్త నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసిన పక్షంలో అదే బాటను తెలుగు బిగ్‌ బాస్‌ కూడా అనుసరించే అవకాశాల్ని కొట్టి పారేయలేం. అదే జరిగితే ఈ సీజన్‌కు కాకపోయినా  వచ్చే సీజన్‌పై సోషల్‌ మీడియా సెలబ్రిటీలు ఆశలు వదిలేసుకోవాల్సి రావచ్చు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)