Breaking News

బిగ్‌బాస్ 10: డబుల్ ఎలిమినేషన్.. రెమ్యునరేషన్ ఎంతిచ్చారు?

Published on Mon, 10/26/2026 - 15:05

తెలుగులో ప్రస్తుతం బిగ్‌బాస్ 10వ సీజన్ నడుస్తోంది. నిన్న ఆదివారంతో ఏడు వారాలు విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దక్షితోపాటు హౌస్‌లో రచ్చ రచ్చ చేసిన షాలిని కూడా ఎలిమినేట్ అయి బయటకొచ్చేసింది. మరి వీళ్లిద్దరికీ పారితోషికం ఎంతిచ్చారు? ఇంతకీ ఔట్ కావడానికి కారణాలేంటి?

(ఇదీ చదవండి: రోహిత్‌తో నువ్వు కూడా అదే ఉద్దేశంతో ఉన్నావా? షాలినికి ఇచ్చిపడేసిన శివాజీ)

తొలుత షాలిని విషయానికొస్తే అగ్నిపరీక్ష పోటీలో పాల్గొని హౌస్‌లోకి వచ్చింది. కానీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రోహిత్ అనే కామనర్‌తో కలిసి రొమాన్స్, లవ్ ట్రాక్ నడపడం తప్పితే మరో పని చేయలేదు. ఏ పని సరిగా చేయక, నోటికి వచ్చినట్లు అందరిపై అరవడం లాంటివి చేయడంతో ఈమెపై విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది. గతవారమే ఎలిమినేట్ అయిపోతే బయటకు పంపించేయకుండా సీక్రెట్ రూంలో ఉంచి తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చారు. అయినా గానీ ఈమె ఆట తీరు మారలేదు.

ఫలితంగా ఏడు వారాల తర్వాత షాలిని ఎలిమినేట్ అయింది. అగ్నిపరీక్ష నుంచి ఈమె వచ్చింది కాబట్టి వారానికి రూ.75 వేల చొప్పున రెమ్యునరేషన్ అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అలా రూ.5.25 లక్షలు ఈమెకు దక్కనున్నట్లు సమాచారం.

ఇక దక్షి విషయానికొస్తే.. స్వతహాగా నటి అయిన ఈమె. ఐదోవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలా హౌస్‌లోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. అటు గేమ్స్ ఆడక, ఇటు మిగిలిన కంటెస్టెంట్స్‌తోనూ సరిగా కలవలేకపోయింది. ఎలాగోలా రెండు వారాలు ఉంది గానీ ఈసారి తక్కువ ఓట్లు పడటంతో ఈమె ఎలిమినేట్ అయిపోయింది. ఈమెకు వారానికి రూ.2.5 లక్షలకు అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. అలా మొత్తం రూ.5 లక్షల పారితోషికం అందుకున్నట్లు టాక్.

(ఇదీ చదవండి: వివాదంలో 'ఫౌజీ'.. దర్శకుడు సారీ చెప్పాలంటున్న బోస్ మనవడు)

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)