Breaking News

బిగ్ బాస్ 10 ఎంట్రీ పై ఆటో రాంప్రసాద్‌ క్లారిటీ!

Published on Sat, 09/05/2026 - 17:33

బిగ్‌బాస్‌ సీజన్‌ 10 మరికొన్ని గంటల్లో(సెప్టెంబర్‌ 6న సాయంత్రం 7 గంటలకు) ప్రారంభం కానుంది. అయితే ఎప్పటి మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ లీకైంది. పలువురి సెలెబ్రెటీల పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వారిలో జబర్దస్త్‌ కమెడియన్‌ ఆటో రాంప్రసాద్‌ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ సారి ఆయన హౌస్‌లో సందడి చేయబోతున్నాడు. అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీపై రాంప్రసాద్‌ డైరెక్ట్‌గా స్పందించలేదు కానీ.. పరోక్షంగా ఎప్పుడో హింట్‌ ఇచ్చాడు. కొత్తగా సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కొత్త జర్నీ స్టార్ట్‌ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడనే విషయం దాదాపు కన్ఫామ్‌ అయిపోయింది. తాజాగా తన ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు రాంప్రసాద్‌. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ.. తనకు సపోర్ట్‌ చేయాలని కోరాడు.

(చదవండి: బిగ్‌బాస్‌ 10: ఈ సారి హౌస్‌లోకి వెళ్లేది వీళ్లే?)

కొత్త చాప్టర్‌ ప్రారంభం.. 
బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్న నేపథ్యంలో తాజాగా తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. అనంతరం తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ..‘జబర్దస్త్ నుంచి ఇప్పటివరకు నా కామెడీని ఎంజాయ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జబర్దస్త్ జర్నీ నాకు చాలా స్పెషల్. మీ ప్రేమ సపోర్ట్ కారణంగానే నేను ఈరోజుకి స్థాయిలో ఉన్నాను… ఇప్పుడు నా జీవితంలో మరొక కొత్త చాప్టర్ ప్రారంభం కాబోతోంది. 

ఈ జర్నీలో కూడా మీ సపోర్ట్ ఇలాగే నా ఉండాలని కోరుకుంటున్నాను. చేంజ్ ఏదైనా మీకోసం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం పక్కా’ టీట్‌ చేశాడు. దీంతో ఆయన బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడనే వార్త నిజమని తేలిపోయింది. అయితే అగ్రిమెంట్‌ ప్రకారం హౌస్‌లోకి వెళ్లేవరకు అధికారికంగా చెప్పకూడదు.అందుకే రాంప్రసాద్‌ ఇలా పరోక్షంగా తన ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఈ సారి రాంప్రసాద్‌తో పాటు మరో జబర్దస్త్‌ కమెడియన్‌ నరేశ్‌ కూడా హౌస్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం. వీరితో పాటు యాంకర్‌ వర్షిణి, పల్లవి గౌడ, యూట్యూబర్‌ నందు, నటుడు టెంపర్‌ వంశీ, వినాయుకు మూవీ హీరో కృష్ణుడు, 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్‌ ఫేమ్‌ దేబ్జానీ మోదక్,  'గుప్పెడంత మనసు' సీరియల్‌ ఫేం ముఖేష్‌ గౌడ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. 
 

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)