Breaking News

ఓటీటీలో 'హారర్ థ్రిల్లింగ్‌' సినిమా స్ట్రీమింగ్‌

Published on Fri, 12/27/2024 - 08:24

బాలీవుడ్‌లో సూపర్ హిట్ ఫ్రాంఛైజీ భూల్ భులయ్యా నుంచి విడుదలైన మూడో సినిమా  'భూల్ భులయ్యా 3'. హారర్, కామెడీ, థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. కార్తీక్‌ ఆర్యన్‌, తృప్తి డిమ్రి,విద్యాబాలన్‌, మాధురీ దీక్షిత్‌ నటించిన ఈ మూవీ నవంబర్‌ 1న విడుదలైంది. అనీస్‌ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

భూల్ భూలయ్యా 3 ప్రాజెక్ట్‌లోకి విద్యాబాలన్  రీఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై భారీ బజ్‌ క్రియేట్‌ అయింది.  బాక్సాఫీస్ దగ్గర  బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుంది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో థియేటర్స్‌లలో చూడని వారు తమ ఇంట్లోనే చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. అందుకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. భూల్ భూలయ్యా 3 ఓటీటీ ప్రకటన విషయాలను పలు వీడియోలతో నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటికే షేర్‌ చేసిన విషయం తెలిసిందే.

రూహ్ బాబా పాత్ర పోషించిన కార్తీక్ ఆర్యన్‌పై అభిమానులు ప్రశంసలు కురిపించారు. హారర్ కామెడీ జానర్లో 2024లో విడుదులై హిట్‌ కొట్టిన సినిమాల జాబితాలో భూల్ భూలయ్యా 3 టాప్‌లో ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్ వండర్‌లా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ఊహకు కూడా అందవని చెప్పవచ్చు. హీరో ఎంట్రీ సాంగ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.  సుమారు 1000 మంది డ్యాన్సర్లతో తెరకెక్కిన ఎంట్రీ సాంగ్‌ సినిమాకే హైలెట్‌ అని చెప్పవచ్చు. సుమారు రూ. 150 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 450 కోట్లు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)