Breaking News

ఓటీటీలో రామబాణం, భోళా శంకర్‌.. ఏ సినిమాకు ఎక్కువ క్రేజ్‌ అంటే?

Published on Sun, 09/17/2023 - 13:38

గోపీచంద్‌ రామబాణం గురి తప్పింది. చిరంజీవి భోళా శంకర్‌.. డీలా పడింది. రెండూ ఫ్లాప్‌ టాక్‌ మూటగట్టుకున్న సినిమాలే! కనీస వసూళ్లు సాధించేందుకు ముప్పుతిప్పలు పడ్డ చిత్రాలే! థియేటర్‌లో కలెక్షన్స్‌ రాబట్టడం అయ్యే పనిలా లేదని ఓటీటీని ఆశ్రయించాయి. కనీసం ఇక్కడి ప్రేక్షకులైనా వన్‌ టైమ్‌ వాచ్‌ చేస్తారేమోనని! ఈసారైనా గురి కుదిరిందా? అనుకున్నది జరిగిందా? అంటే అవును, కాదు అని రెండు సమాధానాలు వినిపిస్తాయి. అదెలా అనుకుంటున్నారా?

రామబాణం సినిమా ఓటీటీలో సక్సెస్‌ అయింది. తెలుగు, సౌత్‌, బాలీవుడ్‌ సినిమాలను వెనక్కు నెడుతూ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌ 1 స్థానంలో ట్రెండ్‌ అవుతోంది. మరి భోళా శంకర్‌ అంటారా? కనీసం టాప్‌ 10 చిత్రాల్లో కూడా చోటు దక్కించుకోలేదు. ఇది మెగా ఫ్యాన్స్‌ను ఎంతగానో నిరాశకు గురి చేస్తోంది. థియేటర్లలోనే అనుకుంటే ఓటీటీలోనూ భోళా శంకర్‌కు కనీస ఆదరణ లేకుండా పోయిందని ఫీల్‌ అయ్యారు.

మరోపక్క రామబాణం ఇంతలా దూసుకుపోతుండటంతో గోపీచంద్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అయితే ఇది నిన్నటి లెక్క. నేడు భోళా శంకర్‌ తొలి స్థానంలోకి రాకెట్‌లా దూసుకొచ్చింది. నిన్నటివరకు టాప్‌ 10లో కూడా లేని చిరు మూవీ నేడు ఏకంగా టాప్‌ 1లో ట్రెండ్‌ అవుతోంది. రామబాణం రెండో స్థానంలో ఉంది.

భోళా శంకర్‌ విషయానికి వస్తే..
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం భోళా శంకర్‌. తమిళ హిట్‌ మూవీ వేదాళం చిత్రానికి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. తమన్నా, కీర్తి సురేశ్‌ ముఖ్య పాత్రలు పోషించగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌ ఫలితాన్ని అందుకుంది. దీంతో నెలరోజులకే ఓటీటీ బాట పట్టింది. సెప్టెంబర్‌ 15 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

రామబాణం విషయానికి వస్తే..
గోపీచంద్‌, డింపుల్‌ హయాతి జంటగా నటించిన చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్‌ తర్వాత గోపీచంద్‌- శ్రీవాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన ఈ సినిమా సెప్టెంబర్‌ 14న ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

చదవండి:  ఐదు రోజులుగా ఇబ్బందిపడుతున్న అనసూయ, ఈ బూతులేంటి అంటూ ట్వీట్‌

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)