Breaking News

సూర్యకు హీరోయిన్‌గా సంగీత దర్శకుడి సోదరి!

Published on Sun, 08/03/2025 - 17:31

సూర్య.. కొన్నాళ్ల క్రితమే 'రెట్రో'తో ప్రేక్షకుల్ని పలకరించాడు. తమిళంలో పర్లేదు గానీ తెలుగులో ఘోరమైన డిజాస్టర్ అయింది. ప్రస్తుతం 'కరుప్పు' అనే మూవీ చేస్తున్నాడు. దీనికి ఆర్జే బాలాజీ దర్శకుడు. కొన్నిరోజుల క్రితం గ్లింప్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‍‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. దీనితో పాటు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితోనూ సూర్య ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులోనే ప్రముఖ సంగీత దర్శకుడి సోదరి లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్‌ సోదరి భవాని శ్రీ.. సూర్య-వెంకీ అట్లూరి మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. భవాని శ్రీ ఇంతకుముందు  పావ కథైగల్, కాపే రణసింగం సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. సూరికి జంటగా 'విడుదలై' చిత్రంలోనూ కథానాయికిగా నటించింది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో ఈమె పాత్ర ఏమిటి అన్నది ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో సూర్య సరసన మలయాళ బ్యూటీ మమిత బైజు చేస్తోంది. మరి భవాని శ్రీ కూడా సూర్యకు హీరోయిన్ లేదా మరేదైనా పాత్ర అనేది తెలియాల్సి ఉంది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన 'బిగ్‌బాస్' ఫేమ్ గౌతమ్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)