Breaking News

తనూజ, దివ్యలను చూస్తుంటే.. భరణి చెల్లెలు కామెంట్స్‌ వైరల్‌

Published on Mon, 11/24/2025 - 11:07

బిగ్‌బాస్‌ 9 తెలుగు సీజన్‌లో భరణితో తనూజ, దివ్యల బాండింగ్‌ బాగా వైరల్‌ అయింది. ఇవేం బాండింగ్స్ రా బాబు అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్‌ చేశారు. తనూజతో భరణి క్లోజ్‌గా మాట్లాడితే చాలు దివ్యకు  కోపం వచ్చేస్తుంది. తనూజ కాలికి నూనె రాసినప్పుడు, ఆమె కెప్టెన్‌ అయ్యాక భరణి ఎత్తుకున్నాడంటూ ఇలా పలు కారణాలు చూపుతూ  తనూజ మీద దివ్య ఫైర్‌ అవుతూనే ఉంది. దీంతో గేమ్‌ పరంగా తనూజ కంటే దివ్యనే ఎక్కువగా నష్టపోయిందని చెప్పవచ్చు. భరణి విషయంలో  ప్రతిసారీ ఆమె కావాలనే తనూజతో గొడవ పెట్టుకుంటుందని ప్రేక్షకుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.

తనూజ, భరణి బంధంపై ఆయన చెల్లెలు ఆరతి పలు వ్యాఖ్యలు చేశారు. 'తనూజ- భరణిల మధ్య మంచి బాండింగ్‌ ఉంది. ఆమెను చూస్తుంటే నాకు సొంత మేనకోడలు మాదిరిగానే అనిపించింది. వారిద్దరిపై సోషల్‌మీడియాలో ‍వైరల్‌ అవుతున్న రీల్స్‌ చూస్తుంటూ చాలా బాగున్నాయి.. వాటిని చూశాక నాకు చాలా సంతోషం అనిపించింది. తనూజ గేమ్‌ కూడా నాకు బాగా నచ్చింది. అయితే, ఫ్యామిలీ వారంలో  హౌస్‌లోకి నేనే వెళ్లాల్సింది. కానీ, నా అన్న కూతురు వెళ్లింది. ఒకవేళ నేను వెళ్లింటే తనూజాను అభినందించేదానిని. 

కానీ, దివ్య, తనూజల మధ్య మా అన్నయ్య నలిగిపోతున్నాడు. దివ్య కూడా భరణి పట్ల మంచి అభిమానం చూపుతుంది. అయితే, ఆమె కాస్త గట్టిగా, డిమాండ్‌ చేసినట్లు భరణితో మాట్లడటం.. ఆపై కొంచెం ఎక్కువగా డామినేటెడ్‌గా మాట్లాడం వల్ల చూసేవారికి నచ్చడం లేదు. అంతేకానీ దివ్యతో ఎలాంటి సమస్య లేదు. దివ్య, భరణిలను ట్రోల్‌ చేసే వారు కాస్త ఆపండి. కానీ, తనూజ ఎప్పుడు కూడా భరణిని డిమాండ్‌ చేస్తూ మాట్లాడలేదు. తను చాలా క్యూట్‌గా అన్నయ్యతో మాట్లాడుతుంది.' అని ఆరతి పేర్కొంది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు