Breaking News

బిగ్‌బాస్‌ నుంచి 'భరణి' ఎంత సంపాదించారంటే..

Published on Mon, 10/20/2025 - 07:32

బిగ్‌బాస్‌ 9 తెలుగు నుంచి బుల్లితెర నటుడు భరణి ఎలిమినేట్‌ అయిపోయారు. సుమారు వారాల పాటు ఆయన హౌస్‌లో కొనసాగారు. ఆదివారం జరిగిన దీపావళి ఎపిసోడ్‌లో నటుడు నాగార్జున (Nagarjuna) వ్యాఖ్యతగా వ్యవహరించారు.  ప్రేక్షకుల ఓటింగ్‌ ప్రకారంగా భరణి ఎలిమినేట్‌ అయ్యారని నాగ్‌ ప్రకటించారు. దీంతో ఆయన హౌస్‌ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అయితే, ఎలాంటి నెగటివిటీ లేకుండానే ఆయన బయటకు వచ్చేశారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ నుంచి ఆయన ఎంత సంపాదించారనేది సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.

బిగ్ బాస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ ఎంత అనేది ముందే అగ్రిమెంట్‌ చేసుకుంటారు. ఈ సీజన్‌లో ఎక్కువ పేరున్న సెలబ్రిటీగా భరణి ఉన్నారు. అందుకే ఈ సీజన్‌లో ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇచ్చినట్లు సమాచారం. వారానికి రూ. 3.5 లక్షలు పైగానే భరణికి బిగ్‌బాస్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌లో ఉన్న 6వారాలకు గాను రూ. 21 లక్షలకు పైగానే ఆయన అందుకున్నట్లు సమాచారం.  డబ్బు కంటే ఎక్కువ ఆయన మంచి పేరు సంపాదించాడని చెప్పవచ్చు. అయితే, హౌస్‌లో చాలామందితో ఎక్కువ బంధాలు పెట్టుకోవడం వల్లే ఎలిమినేట్‌ అయ్యారని తెలిసిందే.

ఈ  వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరూ సేవ్ అవుతూ.. ఫైనల్‌గా భరణి, రాము రాథోడ్ నిలిచారు. వీరిద్దరిలో భరణి ఎలిమినేట్ అయ్యారని నాగార్జున ప్రకటించారు. దీంతో తనూజ, దివ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇమ్మాన్యుయేల్ వద్ద ఉన్న పవర్‌ అస్త్ర భరణి కోసం ఉపయోగించి ఉండుంటే సేవ్‌ అయిండేవాడు. కానీ, అతను రాము రాథోడ్‌కు ఉపయోగించడం.. ఆపై ఓట్ల పరంగా కూడా రాము సేఫ్‌ జోన్‌లో ఉండటంతో అందరూ షాక్‌ అయ్యారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)