Breaking News

Bhagyashri Borse: ‘కాంతా’తో వెలిగిపోతుందా?

Published on Tue, 08/12/2025 - 11:08

ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహిస్తుంది సినిమా. ముఖ్యంగా నటీమణులకు అవకాశాలు తలుపుతడతాయి. అందుకు కొంచెం అందం, కాస్త అదృష్టం ఉంటే చాలు, ఇండియన్‌ సినిమానే ఏలేయవచ్చు. అలా యువ కథానాయకి భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) ఇప్పుడు పాన్‌ ఇండియా ఇమేజ్‌పై కన్నేశారనే చెప్పవచ్చు. 26 ఏళ్ల ఈ మహారాష్ట్రీ పరువాల బ్యూటీ 2023లోనే నటిగా తెరంగ్రేటం చేశారు. అలా ముందుగా హిందీలో నటించిన భాగ్యశ్రీ బోర్సేకు వెంటనే టాలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ రవితేజకు జంటగా మిస్టర్‌ బచ్చన్‌ నటించారు. 

ఈ చిత్రం విజయాన్ని సాధించకపోకపోయినా ఈ అమ్మడు మాత్రం డాన్స్, అందాలారబోతలతో పాపులర్‌ అయ్యారు. తరువాత  కింగ్డమ్‌లో విజయ్‌ దేవరకొండ సరసన నటించారు. ఆ చిత్రం సక్సెస్‌ అయ్యింది. ఇప్పుడు కాంతా అనే బహుభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో దుల్కర్‌సల్మాన్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

స్పిరిట్‌ మీడియా సంస్థ, వేఫారర్‌ ఫిలింస్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాంతా చిత్రం కన్నడం, తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ప్రతిభావంతులైన చిత్ర టీమ్‌తో  కలిసి నటిస్తున్న కాంతా వంటి చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం కావడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ చిత్రంలోని భాగ్యశ్రీబోర్సే ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఈమె గెటప్‌ పలువురిని ఆకట్టుకుంది. ఈ భామ కోలీవుడ్‌లో ఏమాత్రం రాణిస్తారో వేచి చూద్దాం. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)