Breaking News

కుమారిని సవాల్‌గా తీసుకున్నాను!

Published on Wed, 11/12/2025 - 01:35

‘‘తెలుగులో నేను విన్న తొలి స్క్రిప్ట్, ఒప్పుకున్న సినిమా ‘కాంత’. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ కాస్త ఆలస్యంగా మొదలైంది. ఆ గ్యాప్‌లో ‘మిస్టర్‌ బచ్చన్, కింగ్‌డమ్‌’ సినిమాలు చేశాను. ‘కాంత’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. పూర్తి స్థాయిలో నటనకి అవకాశం ఉన్న కుమారి పాత్రను ఈ చిత్రంలో చేశాను’’ అని హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే చెప్పారు. దుల్కర్‌ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జోడీగా నటించిన చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా, సముద్ర ఖని కీలక పాత్రలు చేశారు.

రానా, దుల్కర్‌ సల్మాన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ– ‘‘నాలాంటి కొత్త అమ్మాయికి ‘కాంత’లో కుమారిలాంటి పాత్ర దొరకడం అదృష్టం. సవాల్‌గా తీసుకుని ఈ క్యారెక్టర్‌ చేశాను. ఈ సినిమా కోసం శ్రీదేవి, సావిత్రిగార్ల నటనని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఇప్పటివరకు నన్ను కమర్షియల్‌ నటి అన్నారు. ‘కాంత’ తర్వాత గొప్ప నటి అంటారని ఆశిస్తున్నా.

కుమారి పాత్రని సెల్వరాజ్‌గారు రాసుకున్న విధానం ఆశ్చర్యపరిచింది. నేను నటించిన ‘కాంత, ఆంధ్ర కింగ్‌ తాలూకా’ సినిమాలు ఒకే నెలలో విడుదలవుతుండటం ఎగ్జయిటింగ్‌గా ఉంది. నా వరకు 100 శాతం కష్టపడ్డాను. మంచి ఫలితం దక్కుతుందనే నమక్మకం ఉంది. మంచి కథ కుదిరితే తమిళ్‌లోనూ సినిమా చేస్తాను. అయితే నా తొలిప్రాధాన్యం తెలుగు సినిమాకే. ప్రస్తుతం కొన్ని తెలుగు, హిందీ సినిమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు.

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)