Breaking News

ఎప్పటికైనా ఆ ఇద్దరి దర్శకత్వంలో నటిస్తే చాలు: భాగ్యశ్రీ

Published on Sun, 07/26/2026 - 23:18

మాస్‌రాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే అడుగుపెట్టింది. మొదటి సినిమా ఫ్లాప్ అయినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా భాగ్యశ్రీ, అఖిల్‌తో కలిసి నటించిన లెనిన్ సినిమా ఆమె కెరీర్‌కు మలుపు తిప్పింది.

తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ తన కెరీర్‌పై ప్రత్యేకమైన కలలు ఏమీ పెట్టుకోలేదని స్పష్టం చేసింది. నాకు ఎలాంటి డ్రీమ్ రోల్స్ లేవు.. ఫ్లోలో వెళ్లిపోవడమే. టార్గెట్లు లాంటివి పెట్టుకుంటే టెన్షన్ వస్తుంది. చిన్న చిన్న టైమ్ లైన్స్ పెట్టుకొని ముందుకు సాగితే మనసుకు చాలా హాయిగా ఉంటుందని ఆమె చెప్పింది.

తెలుగు ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న భాగ్యశ్రీ, తన చివరి చిత్రం కూడా తెలుగులోనే చేస్తానని ఇప్పటికే తెలిపింది. అలా ఈ గ్యాప్‌లో రాజమౌళి, సుకుమార్ దర్శకత్వంలో నటిస్తేచాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం భాగ్యశ్రీ తెలుగు నేర్చుకుంటోంది. అంతేకాదు తెలుగు సంస్కృతికి కూడా అలవాటు పడుతోంది. ఉదయం అల్పాహారం నుంచి డిన్నర్ వరకు అన్నింటిలో తెలుగు వంటకాలను ఇష్టపడుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఉప్మా వంటి వంటకాలు తన ఫేవరెట్ లిస్ట్‌లో ఉన్నాయని వెల్లడించింది.

ఇక తనకు ప్రత్యేకంగా ఏ నగరంలో సెటిల్ అవ్వాలని లేదని, కానీ హిల్ స్టేషన్లు అంటే చాలా ఇష్టమని తెలిపింది. బీచ్‌ల కంటే కొండ ప్రాంతంలో ఉండడమే తనకు హాయిగా అనిపిస్తుందని చెప్పింది. ఇటీవల తన సంపాదనతో తల్లికి మొబైల్ ఫోన్ కొనిచ్చిందని తెలిపింది. తనది మధ్యతరగతి కుటుంబమని.. కానీ తల్లిదండ్రుల కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదని ఆమె భావోద్వేగంగా చెప్పింది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)