Breaking News

బాలీవుడ్‌ క్వీన్‌.. సూపర్‌ హిట్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్!

Published on Mon, 05/15/2023 - 20:50

మాధురి దీక్షిత్ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో ఆమె పేరు ముందు వరుసలో ఉంటుంది. 1990ల్లో బాలీవుడ్‌లో స్టార్ ‍హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 1967 మే 15న ముంబయిలో జన్మించింది. మైక్రో బయాలజిస్ట్ కావాలనుకున్న మాధురి దీక్షిత్.. మూడేళ్ల వయసులోనే డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఎనిమిదేళ్ల వయసులోనే కథక్ నృత్యాన్ని నేర్చుకుంది.  బాలీవుడ్ డ్యాన్స్ క్వీన్‌గా పేరు సంపాదించింది.  బాలీవుడ్‌లో అగ్ర హీరోలందరితో నటించిన ఆమె ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. ఇవాళ ఆమె 56వ బర్త్‌ డే సందర్బంగా ప్రత్యేక కథనం.

 

(ఇది చదవండి: నరేశ్-పవిత్ర.. వారి బంధానికి ఇంతకన్నా ఏం కావాలి?)

1984లో అబోద్ అనే సినిమాతో మాధురి దీక్షిత్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్నిసినిమాల్లో సహాయ నటిగా చేసిన మాధురి..తేజాబ్ సినిమాలో ముఖ్య పాత్ర పొషించారు. ఈ సినిమా ఆమెకి మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రమం మొదటి ఫిలింఫేర్ నామినేషన్‌కు కూడా ఎంపికైంది. ఆ తర్వాత  రాం లఖాన్ (1989), పరిందా (1989), త్రిదేవ్ (1989), కిషన్ కన్హయ్యా (1990) వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌లో శ్రీదేవి కంటే ఎక్కువగా మాధురి పాపులారిటీ సాధించింది. 

(ఇది చదవండి: ఏజెంట్‌పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..)

1990లో దీక్షిత్ ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన దిల్ అనే ప్రేమ కథా చిత్రంలో ఆమిర్ ఖాన్ సరసన నటించారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా మొట్ట మొదటి ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా తెచ్చి పెట్టింది.  ఆ తర్వాత సాజన్ (1991), బేటా(1992), ఖల్ నాయక్ (1993), హం ఆప్కే హై కౌన్ (1994), రాజా (1995) వంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించారు. బేటా చిత్రంలో చదువురాని అమాయకుడికి భార్యగా నటించిన పాత్రకి రెండో ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది.

1999లో డాక్టర్ శ్రీరామ్‌ నేనేను మాధురి  వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు. దాదాపు ఓ దశాబ్దానికి పైగా అక్కడే నివసించారు. ఈ జంటకు  అరిన్, ర్యాన్ అనే ఇద్దరు కుమారులు సంతానం. ప్రస్తుతం మాధురి దీక్షిత్ రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ది నేమ్ ఫేమ్‌తో అభిమానులను పలకరించింది. బాలీవుడ్‌లో దశాబ్దాల పాటు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన మాధురికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)