ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్
Breaking News
తిరుమలలో వైభవంగా బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం
Published on Thu, 04/30/2026 - 07:24
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు . తను ప్రేమించిన కావ్య రెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు. రెండు కుటుంబాల సమక్షంలో బుధవారం రాత్రి వారి వివాహం జరిగింది. తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ఈ వేడుకలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
మే 1న హైదరాబాద్‌లో భారీ ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డి తండ్రి, తాత న్యాయ రంగ ప్రముఖలని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ గతేడాది ‘కిష్కింధపురి’ చిత్రంతో హిట్ కొట్టాడు. . ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ అనే ఆసక్తికరమైన రెండు ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్నారు.
Tags : 1