Breaking News

ఓటీటీలో బ్యూటీఫుల్ సినిమా.. 'బత్తా' తెలుగు రివ్యూ

Published on Thu, 10/29/2026 - 08:05

కొన్ని సినిమాలు పెద్దగా అంచనాల్లేకుండానే వచ్చి సంచలనం సృష్టిస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే 'బత్తా'. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో బాలాజీ ధరణిధరన్ దర్శకత్వం వహించిన తమిళ మూవీ ఇది. ఈనెల 01వ తేదీన థియేటర్లలో రిలీజై టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఇదెలా ఉంది? చూడొచ్చా లేదా?

(ఇదీ చదవండి: 'రామాయణ' సినిమా ఫస్ట్ రివ్యూ)

కథేంటి?
అది 1970ల కాలం. బత్తా(విజయ్ సేతుపతి) అనే రౌడీ తన ప్రత్యర్థులని చావగొడుతూ ఊరిలో డామినేషన్ చూపిస్తుంటాడు. భార్య కన్నిమా(లిజి మోల్), కూతురికి కూడా టైమ్ ఇవ్వనంత బిజీగా ఊరిమీద పడి తిరుగుతుంటాడు. అలాంటి ఇతడు అనుకోకుండా ఓ రోజు అదే ఊరిలోని స్కూల్ బాత్రూంలో లాక్ అయిపోతాడు. ఇతడు లోపల ఉండగా బయట నుంచి ఎవరో గడియ పెట్టేస్తారు. తర్వాత ఏమైంది? బత్తా బయటకు రాగలిగాడా లేదా? శబరి (సాయి పృథ్వీరాజ్) అనే పిల్లాడికి బత్తాతో సంబంధమేంటి? చివరకు ఎవరెవరు ఏమేం తెలుసుకున్నారు అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
కొన్ని సినిమాలు కంటికి నచ్చుతాయి. కొన్ని మనసుకు నచ్చుతాయి. 'బత్తా' రెండో కేటగిరీలోకి వస్తుంది. చూస్తున్నంతసేపు ఎంతో సరదాగా అనిపించే ఈ మూవీ.. పూర్తయిన తర్వాత మనసుకు హాయినిస్తుంది. చెప్పాలంటే చిత్రం, అందులోని పాత్రలు మనతో పాటు ఇంటికి వచ్చేస్తాయి. చాలాసేపు ఆలోచించేలా చేస్తాయి. అసలు మనలో చాలామంది ఏమేం మిస్ అవుతున్నాం అనే విషయాలు గుర్తుచేస్తాయి.

'బత్తా' గురించి చెప్పాలంటే స్టోరీ చాలా సింపుల్. ఓ బాత్రూంలో ఓ పేరు మోసిన రౌడీ ఇరుక్కుపోతాడు. దాదాపు 8 రోజుల పాటు అందులోనే ఉండిపోతాడు. మరి బయటకొచ్చాడా లేదా? ఒకవేళ వస్తే ఏం చేశాడు? ఇతడిలో ఏం మార్పొచ్చింది? అనేది కథ. ఏంటి ఇదేనా కథ. ఇందులో అంత స్పెషల్ ఏముంది అని మీరనుకోవచ్చు. కానీ చూస్తే మాత్రం ఆ మాట అనరు. ఇంత మంచి సినిమా థియేటర్లలో ఎందుకు మిస్ అయ్యామా అనుకుంటారు.

ఇప్పుడంటే పిల్లలు ఫోన్లు చూసి చెడిపోయారు గానీ గతంలో ఎంతో ఆనందంగా ఉండేవాళ్లు. అమాయకంగా, పక్కనోళ్లకు సాయం చేయాలనే మంచితనంతో, వాళ్లు వీళ్లు చెప్పినవి విని కొందరిని చూసి తెగ భయపడిపోవడం, నిజం చెప్పడానికి తర్జనభర్జన పడటం లాంటివి అప్పటి పిల్లల్లో కనిపించేవి. ఇందులో శబరి పాత్రకు ఇలాంటి లక్షణాలే ఉంటాయి. అవే ఈ కథకి టర్నింగ్ పాయింట్స్.

ఓ ఎనిమిదేళ్ల పిల్లాడు.. ఓ పెద్ద రౌడీ జీవితాన్ని ఎలా మార్చేశాడు? సదరు పిల్లాడు చెప్పిన మాటలు.. ఆ రౌడీని ఎలాంటి ఆలోచనల్లో పడేశాయి? లాంటివి వినడానికి చాలా సాధారణంగా ఉంటాయి. కానీ వాటిని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇంత బాగున్నాయేంటి అనిపించకమానదు. చిన్నతనంలో చాలామంది పిల్లలకు ఏదేదో చేసేయాలి, ఏదో అయిపోవాలని ఉంటుంది. కానీ చుట్టూ ఉండేవాళ్ల ప్రవర్తన.. సదరు పిల్లల్ని ఎలా మార్చేస్తుంది అనే విషయాల్ని ఇందులో చూపించిన విధానం మన చిన్ననాటిని గుర్తుచేస్తుంది.

ఈ సినిమా కథ గురించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది. కాబట్టి ఈ రివ్యూలో డీటైల్డ్‌గా చెప్పాలనుకోలేదు. ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే 'బత్తా'ని మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు. ఎందుకంటే యాక్షన్, థ్రిల్లర్సే కాదు అప్పుడప్పుడు ఈ తరహా సినిమాలు చూస్తేనే జీవితం అంటే ఏంటి? రోజువారీ బిజీలో పడి మనం ఏమేం కోల్పోతున్నాం? అనే విషయాలు తెలుస్తాయి.

బత్తా, శబరి పాత్రలు కథకు కీలకం కావొచ్చు. కానీ బాత్రూం తలుపు తయారు చేసిన ఓ వడ్రంగి(కార్పెంటర్), ఓ రస్క్, శబరి ఆడుకునే ఓ బొమ్మ, ఓ పాము.. ఇలా సినిమాలో పెద్దగా గమనించని చాలా వస్తువులు, మనుషులు కథనే కాదు బత్తా జీవితాన్ని మలుపు తిప్పుతారు. సినిమా అంతా ఒకెత్తు క్లైమాక్స్ మరో ఎత్తు. బత్తాకి నిజం తెలిసే సన్నివేశం, చివరలో వచ్చే 'చెల్లమే మగళే' పాట, నా దగ్గర రస్క్ కొనడానికే డబ్బులున్నాయి లాంటి సీన్స్ వస్తున్నప్పుడు మన గుండె బరువెక్కిన ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల విషయానికొస్తే బత్తా పాత్రలో విజయ్ సేతుపతి జీవించాడు. చెప్పాలంటే పరకాయ ప్రవేశం చేశాడు. సేతుపతి ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న నటుడు కాబట్టి ఇతడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇందులో శబరి అనే ఏడేళ్ల పిల్లాడిగా చేసిన  సాయి పృథ్వీరాజ్ నటన గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఇంత చిన్న పిల్లాడు అసలు అంత బాగా యాక్టింగ్ ఎలా చేశాడా? అనిపించకమానదు. బత్తా భార్య కన్నిమాగా చేసిన లిజి మోల్, కూతురిగా చేసిన పాప కూడా అద్భుతంగా నటించారు.

టెక్నికల్ విషయాలకొస్తే దర్శకుడు బాలాజీ ధరణిధరణ్‌కి ఇంతమంచి సినిమా తీసినందుకు మొదటగా క్రెడిట్స్ ఇచ్చేయాలి. తర్వాత సంగీతమందించిన సాయి అ‍భ్యంకర్‌ని మెచ్చుకోవాలి. అవకాశమొచ్చింది కదా దబదబా బాదేయాలి. అవసరం లేకపోయినా పాటలు ఇచ్చేయాలి కాకుండా ఆ సీన్‌కి ఎంత అవసరమో అంతే మ్యూజిక్ ఇచ్చాడు. 'చెల్లమే మగళే' పాట అర్థం తెలియకపోయినా గానీ తెగ నచ్చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సెట్ వర్క్ అయితే నిజంగా మనం కూడా 1970-80ల్లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. పాత్రలు వేసుకున్న డ్రస్సుల దగ్గర నుంచి ప్రతిదీ ఫెర్‌ఫెక్ట్‌గా సరిపోయింది. అసభ్యకర సీన్స్ ఏం లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.

-చందు డొంకాన, సాక్షి వెబ్‌డెస్క్

(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' ఓటీటీ రివ్యూ)

Videos

నా పెళ్లి గురించి మీకెందుకు? KTR పై బల్మూరి వెంకట్ భార్య ఫైర్

కాస్కోండి ఒక్కొక్కడికి ప్యాంట్ తడిచిపోకపోతే.. రోజా నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)