Breaking News

తెలుగు ప్రేక్షకులంటే అందరికీ చులకనే!

Published on Sun, 06/07/2026 - 10:24

టికెట్ కొని వెళ్లే ప్రేక్షకులంటే హీరోలు, దర్శకనిర్మాతలకు కనీస గౌరవం ఉండాలి. కానీ గత కొన్నాళ్లుగా చూస్తే మాత్రం అది చాలా తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. లేటెస్ట్‌గా 'బాలన్' ట్రైలరే దీనికి మరో ఉదాహరణ. 'మంజుమ్మల్ బాయ్స్' దర్శకుడు తీసిన కొత్త మూవీ ఇది. తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు కానీ టాలీవుడ్ ఆడియెన్స్ అంటే ఏం చూపించినా చూస్తారులే అని డబ్బింగ్ వింటేనే అర్థమవుతోంది.

(ఇదీ చదవండి: సీఎం విజయ్ అలా చేయడం కరెక్ట్ కాదు)

మంజుమ్మల్ బాయ్స్ సినిమా తీసిన దర్శకుడు.. జన నాయగణ్, టాక్సిక్ మూవీస్ తీసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ దీన్ని నిర్మించింది. విజువల్స్, స్టోరీ బాగున్నాయి. కానీ తెలుగు డబ్బింగే దారుణంగా చేశారు. గూగుల్ ట్రాన్స్‌లేటర్‌లో కాపీ చేసి డబ్బింగ్ చేశారా అనే సందేహం కలుగుతోంది. ట్రైలర్‌లోని కంటెంట్ ఆసక్తిగా అనిపించినప్పటికీ.. తెలుగు డబ్బింగ్ ఆ ఆసక్తిని మొత్తం తగ్గించేసినట్లు అనిపించింది.

వచ్చే శుక్రవారం(జూన్ 19) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. మూవీ రిలీజ్ నాటికైనా డబ్బింగ్ విషయంలో మార్పులు చేర్పులు చేస్తే సరేసరి. లేదంటే మాత్రం విమర్శలు తప్పవు. ఇదే కాదు టైటిల్ కూడా 'బాలన్' అని ఉన్నది ఉన్నట్లు పెట్టేశారు.

ట్రైలర్ బట్టి చూస్తే.. సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. మానసిక స్థితి సరిగ్గా లేని ఒక తల్లి.. ఆ తల్లి ఏం చేస్తుందో తెలియని ఒక పిల్లాడు. అనుకోకుండా ఆ పిల్లాడు కనిపించకుండాపోవడం.. అతడి కోసం పోలీసులు వెతకడం.. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: రజనీకాంత్ సినిమా.. ఇంకెంతమంది మారతారో ఏంటో?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు