Breaking News

తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం

Published on Mon, 02/20/2023 - 09:15

తారకరత్న మరణం నందమూరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆయన ఇక లేరన్న వార్తను కుటుంసభ్యులతో పాటు నందమూరి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తుంది. గతనెల 27న గుండెపోటుకు గురైన తారకరత్న  23రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

చదవండి: తారకరత్న భార్య, పిల్లల్ని చూశారా? చిన్న వయసులోనే తీరని దుఃఖం

అయితే తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి, ఇద్దరు కూమార్తెలు, ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. తండ్రి పార్థివ దేహం వద్ద ఆయన పెద్ద కూతురు వెక్కి వెక్కి ఏడ్చిన వీడియో అందరిని కలిచి వేసింది. ఆయన మరణంతో భార్య, పిల్లలు ఒంటరి వారైపోయారు. దీంతో తారకరత్న కుటుంబం విషయంలో బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది.

చదవండి: తారకరత్న  భార్య అలేఖ్యా రెడ్డికి అస్వస్థత..

ఆయన ముగ్గురు పిల్లల బాగోగులు, చదువులు తానే చూసుకుంటానని, బాబాయ్‌గా తారక్‌ కుటుంబానికి నిత్యం అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా ఇచ్చారట. ఇక తారకరత్న, బాలకృష్ణకు మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. తారకరత్న కోలుకొని తిరిగిరావాలని బాలయ్య ప్రత్యేక పూజలు కూడా చేశారు. తారకరత్న హాస్పిటల్‌లో చేరినప్పటి నుంచి బాలయ్య  అక్కడే ఉండి ఆరోగ్య విషయాలను పర్యవేక్షించారు. బాబాయ్‌గా ఎప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు. ఇప్పుడు ఆయన మరణాంతరం కూడా తన కుటుంబానికి అండగా నిలబడ్డారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)