Breaking News

బాలీవుడ్ లో మర్యాద ఇవ్వరు.. యంగ్ హీరో కన్నీళ్లు

Published on Sun, 05/04/2025 - 17:11

సినిమా ఇండస్ట్రీ అంటేనే నెపోటిజం, ఒకరిని ఒకరు తొక్కేయడాలు లాంటివి చాలా ఉంటాయి. ఇది అందరికీ తెలుసు. కాకపోతే వీటి గురించి పెద్దగా బయటకు రాదు, రానివ్వరు. అప్పుడప్పుడు కొందరు నటీనటులు మాత్రం తమ బాధని వెళ్లగక్కుతుంటారు. అవి వీడియోల రూపంలో వైరల్ అవుతుంటాయి.

(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!)  

తాజాగా హిందీ సినిమాలు చేస్తున్న ఓ యంగ్ హీరో బాబిల్ ఖాన్.. ఏడుస్తూ బాధపడుతూ ఓ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేశాడు. బాలీవుడ్ లో అస్సలు మర్యాద ఇవ్వరు అని నోటికొచ్చింది మాట్లాడాడు. ఇది జరిగిన కాసేపటికే వీడియోని డిలీడ్ చేయడంతో పాటు అకౌంట్ ని డీయాక్టివేట్ చేసేశాడు.

'ఈ రోజు మీ అందరితో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇండస్ట్రీలో(బాలీవుడ్) అర్జున్, అనన్య, షనయాతో పాటు సంబంధం లేని అర్జిత్ సింగ్ లాంటివాళ్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ అస్సలు మర్యాద ఇవ్వడం లేదు. ఇప్పటివరకు నేను చూసినవాటిలో ఇదే అత్యంత నకిలీ ఇండస్ట్రీ. ఇది బాగుండాలని కోరుకునేది కొందరే. నేను మీకు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను' అని బాబిల్ ఏడుస్తూ సదరు వీడియోలో చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: తెలుగు హీరోతో మృణాల్ ప్రేమ? నిజమేంటి?)  

గతంలో లంచ్ బాక్స్, పీకూ, పాన్ సింగ్ తోమార్ తదితర సినిమాలతో అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ కొడుకే ఈ బాబిల్ ఖాన్. 2020లో తండ్రి చనిపోయిన తర్వాత నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. పలు సినిమాల్లో సహాయ నటుడిగా చేశాడు. మొన్నీమధ్యే లాగౌట్ అనే ఓటీటీ మూవీలో హీరోగానూ చేశాడు.

ఇప్పుడు చేసిన ఈ వీడియో పీఆర్ స్టంట్ లేదంటే నిజంగా బాధతో చెప్పాడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అర్జున్, అనన్య, షనయా నెపోటిజం అని అన్నాడు. అదే టైంలో తన తండ్రి వల్లే ఇండస్ట్రీలోకి వచ్చాననే విషయాన్ని బాబిల్ మర్చిపోయినట్లున్నాడు. మరి దీని వెనుక ఏం మతలబు ఉందో?

(ఇదీ చదవండి: భార్య, సవతి కలిసి భర్తని మాయం చేస్తే.. ఓటీటీ రివ్యూ)

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)