Breaking News

మహారాణి బయోపిక్‌.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న నిర్మాత కూతురు!

Published on Fri, 01/05/2024 - 09:57

బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన భారతదేశ మొట్టమొదటి రాణి వీరమంగై వేలు నాచ్చియార్‌ జీవిత చరిత్ర సినిమాగా రానుంది. వేలు నాచ్చియార్‌ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ట్రెండ్స్‌ సినిమాస్‌ పతాకంపై జేఎం.బషీర్‌ నిర్మిస్తున్నారు. ఆర్‌.అరవింద్‌రాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఇందులో టైటిల్‌ పాత్రను నటి ఆయిషా పోషిస్తున్నారు. ఈమె నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. దీనికి ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందించడం విశేషం.

కాగా ఇందులో పెరియమరుద అనే ముఖ్య పాత్రను ఈ చిత్ర నిర్మాత, నటుడు జేఎం.బషీర్‌ పోషిస్తున్నారు. ఈ చిత్ర పరిచయ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక టీ.నగర్‌లోని దేవర్‌ మహల్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత జేఎం.బషీర్‌ మాట్లాడుతూ.. వేలు నాచ్చియార్‌ జీవిత చరిత్రను చిత్రంగా రూపొందించడం గర్వంగా ఉందన్నారు. ఇందులో టైటిల్‌ పాత్రను తన కుమార్తె ఆయిషా పోషించడం ఇంకా సంతోషంగా ఉందన్నారు.

మన దేశం కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడిన తొలి మహిళారాణి గురించి ఈ తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్న సదుద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. తాను నటించిన దేశీయ తలైవర్‌ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని, ఆ తరువాత వేలు నాచ్చియార్‌ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి జె.శ్రీధర్‌ చాయాగ్రహణం అందించనున్నారని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు జేఎం.బషీర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చదవండి: ప్రభాస్ హీరోయిన్‌కి చేదు అనుభవం.. అలా జరగడంతో!

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)