'బిగ్‌బాస్ 9' ఆయేషా ఓటీటీ సిరీస్.. సడన్‌గా తెలుగులో స్ట్రీమింగ్

Published on Sat, 11/15/2025 - 17:10

బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్‌ ఓ మాదిరిగా నడుస్తోంది. ఈసారి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌గా వచ్చినవాళ్లలో ఆయేషా జీనత్ ఒకరు. రావడం రావడమే ఫుల్ హడావుడి చేసిన ఈమె.. గతంలో తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొని రచ్చ రచ్చ చేసింది. ఏకంగా 9 వారాల పాటు హౌసులో ఉంది. దీంతో తెలుగులోనూ ఆ రేంజ్ రచ్చ చేయడం గ్యారంటీ అనుకున్నారు. కానీ వచ్చిన రెండు వారాలకే హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అలా అని ఈమె ఎలిమినేట్ కాలేదు. వైరల్ ఫీవర్ రావడంతో డాక్టర్స్ సలహా మేరకు బయటకొచ్చేసింది.

ఆయేషా జీనత్ గురించి మళ్లీ ఇప్పుడు ఎందుకు డిస్కషన్ వచ్చిందా అంటే ఈమె నటించిన 'ఉప్పు పులి కారం' అనే సిరీస్.. గతేడాది మే నెలలో హాట్‌స్టార్‌లో రిలీజైంది. దాదాపు 128 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు దీన్ని ఎలాంటి హడావుడి లేకుండా తెలుగులోకి తీసుకొచ్చేశారు. ఈరోజు (నవంబరు 15) నుంచి హాట్‌స్టార్‌లోనే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించారు.

(ఇదీ చదవండి: 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌లో ఆ రెండు రిలీజ్.. రాజమౌళి క్లారిటీ)

'ఉప్పు పులి కారం' అంటే తమిళంలో ఉప్పు-చేదు-కారం అని అర్థం. తెలుగులోనూ అదే టైటిల్‌ ఉంచేశారు. ఇందులో ఆయేషాతో పాటు పొన్నవన్, వనిత లాంటి సీనియర్ యాక్టర్స్.. అశ్విని ఆనందిత, దీపిక వెంకటాచలం తదితరులు నటించారు. అధునిక ప్రపంచంలోని ప్రేమ, రిలేషన్ తదితర అంశాల ఆధారంగా దీన్ని తీశారు. అయితే ఇది కొరియన్ సిరీస్ అయిన 'మై ఫాదర్ ఈజ్ స్ట్రేంజ్'కి అధికారిక రీమేక్.

ఈ సిరీస్‌తో పాటు ఈ వారం చాలానే హిట్ సినిమాలు కూడా ఓటీటీల్లోకి వచ్చాయి. వీటిలో తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ లాంటి హిట్ మూవీస్ ఉన్నాయి. అలానే అవిహితం, జూరాసిక్ వరల్డ్ రీబర్త్, జాలీ ఎల్ఎల్‌బీ 3, నిశాంచి 2, ఎక్క లాంటి చిత్రాలతో పాటు ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చేసింది.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ డైరెక్టర్ సినిమా)

Videos

Jubilee Hills by Election Results: ఫలితాలపై ఫన్నీ రియాక్షన్

ఢిల్లీ బ్లాస్ట్... మరో డాక్టర్ అరెస్ట్

Jangaon : మరో ఘోర ప్రమాదం RTC బస్సు నుజ్జునుజ్జు

Hindupur : ముందే పోలీసులకు చెప్పి YSRCP ఆఫీసుపై దాడి

Chandrababu: బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ

Jada Sravan: పవన్ అలా చేస్తే సెల్యూట్ చేస్తా..

స్టీల్ ప్లాంట్పై విషం కక్కిన బాబు..వివాదాస్పద వ్యాఖ్యలు

మాజీ AVSO సతీశ్ కుమార్ మృతి కేసులో సీన్ రీకన్ స్ట్రక్షన్

YSRCP ఆఫీస్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్

హిందూపురం YSRCP ఆఫీస్ పై దాడి సాకే శైలజానాథ్ వార్నింగ్

Photos

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)