Breaking News

ఓటీటీలో అవతార్-2.. ఇక నుంచి ఫ్రీగా చూసేయొచ్చు!

Published on Tue, 05/16/2023 - 07:01

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన విజువల్‌ వండర్‌ 'అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌' (అవతార్-‌ 2). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీస్థాయిలో వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం పలు ఓటీటీల్లోనూ రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. తాజాగా సినీ ప్రియులకు చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి అద్దె చెల్లించకుండానే చూసేలా ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రాబోతుంది.

(ఇది చదవండి: సల్మాన్‌తో రిలేషన్‌లో ఉందా?.. ఏకంగా నా భర్తనే అడిగారు: హీరోయిన్)

రెంట్‌ చెల్లించకుండానే ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్‌కు అందుబాటులో రానున్నట్లు ప్రకటించింది. ఈ విజువల్‌ వండర్‌ని జూన్‌ 7న విడుదల చేస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని భాషల్లో విడుదల కానుందన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.

(ఇది చదవండి: చెర్రీ ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి.. మనసులు గెలిచారు భయ్యా!)

కాగా.. హాలీవుడ్‌ దిగ్గజం జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలో సందడి చేసింది. తొలి భాగం అవతార్‌లానే పలు రికార్డులు సృష్టించిన ఈ సీక్వెల్‌ 2023 మార్చి 28 నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేదికలైన మూవీఎస్‌ ఎనీ వేర్‌, యాపిల్‌ టీవీ, ప్రైమ్‌ వీడియో, వుడు, ఎక్స్‌ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్‌ మూవీ అండ్‌ టీవీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చింది.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)