Breaking News

సైఫ్ అలీ ఖాన్‌ను గుర్తు పట్టలేదు.. డబ్బులు కూడా తీసుకోలేదు: ఆటో డ్రైవర్

Published on Mon, 01/20/2025 - 20:00

బాలీవుడ్‌ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంట్లో చోరికి యత్నించిన షరీఫుల్‌ ఇస్లాం షెహజాద్‌ మొహమ్మద్‌ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని 30 ఏళ్ల బంగ్లాదేశీయునిగా(Bangladesh) పోలీసులు గుర్తించారు. అతని అసలు పేరు షరీఫుల్‌ ఇస్లాం షెహజాద్‌ మొహమ్మద్‌ రోహిల్లా అమీన్‌ ఫకీర్.  భారత్‌ వచ్చాక బిజయ్‌  దాస్‌గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు.

అయితే దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్‌ను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తండ్రిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. అయితే సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్  భజన్ సింగ్ ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించారు. 

తాను ఆటోలో వెళ్తండగా ఓ మహిళ ఆగండి ‍అంటూ గట్టిగా అరిచిందని.. దీంతో వెంటనే యూ టర్న్ తీసుకుని బిల్డింగ్ గేట్ దగ్గరికి వచ్చానని తెలిపాడు. ‍అక్కడి రాగానే ఆ వ్యక్తి దుస్తులంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి.. అప్పుడు సమయం దాదాపు 2 గంటల 45 నిమిషాలవుతోందని అతను వివరించాడు. రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో..  బాంద్రా వెస్ట్ నుంచి టర్నర్‌ రోడ్‌, హిల్ రోడ్ ద్వారా లీలావతి హాస్పిటల్‌కు చేరుకున్నాం. వారివెంట వచ్చిన పిల్లవాడు మధ్యలో కూర్చున్నాడు.. అతని కుడి వైపున గాయపడిన వ్యక్తి (సైఫ్)  కూర్చున్నాడు.. కానీ రాత్రి కావడంతో నేను అతన్ని గుర్తించలేకపోయాను.. వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవడమే లక్ష్యంగా ఆటోను నడిపినట్లు వెల్లడించారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)