Breaking News

మొబైల్‌తో ఇబ్బంది పడుతున్నాను.. ఆషూ రెడ్డి వీడియో విడుదల

Published on Tue, 06/27/2023 - 08:27

డ్రగ్స్‌ కేసులో కేపీ చౌదరి అరెస్టుతో టాలీవుడ్‌ మరోసారి ఉలిక్కిపడింది. చౌదరిని విచారించిన పోలీసులు ఆయన కాల్‌లిస్ట్‌లో పలువురు సినీ ప్రముఖుల పేర్లను గుర్తించారు. ఈ లిస్టులో ప్ర‌ముఖంగా బిగ్ బాస్ కంటెస్టెంట్‌, న‌టి ఆషు రెడ్డితో పాటు న‌టి జ్యోతి,  సురేఖా వాణి పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  వీరు కె.పి.చౌద‌రితో ఉన్న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పలు మీడియాలో కూడా వార్తలు రావ‌డంతో తమకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదంటూ నటి సురేఖ వాణి, జ్యోతితో పాటు ఆషూ రెడ్డి కూడా ఇప్పటికే రియాక్ట్ అయ్యారు.

(ఇదీ చదవండి: ఆకాంక్ష పూరి నడుమును కెమెరాల ముందే నటుడు పట్టుకోవడంతో..)

అయినా కూడా పలు యూట్యూబ్‌ ఛానల్‌ వారు తమ పేర్లను పదేపదే ప్రసారం చేయడంతో ఇబ్బందులకు గురవుతున్నామని తాజాగా మళ్లీ ఆషూ రెడ్డి ఒక వీడియో విడుదల చేసింది. 

'నేను ఇప్పటికే ఈ డ్రగ్స్‌ కేసుతో సంబంధం లేదని చెప్పాను. కేపీ చౌదరితో కొన్ని వందల ఫోన్‌ కాల్స్‌  మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు, నా వద్ద కూడా కాల్‌ డేటా ఉంది. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల వల్ల రెండురోజుల నుంచి మెంటల్‌గా టార్చర్‌ అనుభవిస్తున్నాను. ఈ కేసులో నా పాత్ర లేకున్నా కొందరు వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంతే కాకుండా పలు మీడియా వారు నా వ్యక్తిగత నంబర్‌ను డిస్‌ప్లే చేశారు. దాంతో కొన్ని వందల ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. ఏమీ చేయలేక ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాను. రెండు నెలలుగా షూటింగ్‌ పనిమీద ఇతర దేశాల్లోనే ఉన్నాను. దయచేసి మాకూ కెరియర్‌ ఉందని గమనించండి. ఇకనైన తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి' అని ఆషూ రెడ్డి తెలిపింది.

(ఇదీ చదవండి: అభిమానితో ఇంత సాదాసీదాగా ఉన్న ఈ హీరోయిన్‌ గురించి తెలిస్తే..)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)