Breaking News

ఈ హీరో 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే!

Published on Wed, 12/17/2025 - 08:45

అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం రెట్ట తల. సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా నటించిన ఇందులో తాన్యా రవిచంద్రన్‌, హరీష్‌ పేరడీ, యోగేష్‌ స్వామి, జాన్‌ విజయ్‌, బాలాజీ మురుగదాస్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బీటీజీ యూనివర్సల్‌ పతాకంపై బాబీ బాలచందర్‌ నిర్మించిన ఈ చిత్రానికి మాన్‌ కరాటే చిత్రం ఫేమ్‌ క్రిష్‌ తిరుకుమరన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని అందించారు.

ప్రీరిలీజ్‌ ఈవెంట్‌
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్‌ కార్యక్రమం నిర్వహించగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌, వడివళగన్‌, ముత్తయ్య, కిషోర్‌ ముత్తుస్వామి, బాలాజీ వేణుగోపాల్‌, గోకుల్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 

నా శిష్యుడే
ఈ సందర్భంగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు తన శిష్యుడని.. గజిని, తుపాకీ చిత్రాలకు పనిచేశారని పేర్కొన్నారు. ఈ మూవీ టైటిల్‌ కూడా తనదేదని, తనను అడగ్గానే ఇచ్చానని చెప్పారు. నటుడు అరుణ్‌ విజయ్‌ 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉండటం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఆయన శ్రమజీవి అని.. మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారనే నమ్మకం ఉందన్నారు.

ఛాలెంజింగ్‌ పాత్ర
అరుణ్‌ విజయ్‌ మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే తనను బాగా ఆకట్టుకుందన్నారు. అదే సమయంలో ఇందులో నటించడం ఛాలెంజ్‌గా అనిపించిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. క్లైమాక్స్‌ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని, ఇందులో హీరో ధనుష్‌ ఒక పాట పాడటం విశేషమని పేర్కొన్నారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)