Breaking News

సడన్‌గా ఓటీటీలోకి యాక్షన్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ అక్కడే!

Published on Thu, 03/14/2024 - 19:34

సంక్రాంతికి రిలీజ్‌ చేస్తే కనీస వసూళ్లయినా వస్తాయి.. అందుకే చాలామంది సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలున్నా సరే రిలీజ్‌ చేసేందుకు వెనకడుగు వేయరు. మరికొందరేమో పెద్ద సినిమాలు బరిలో ఉంటే మరో ఆప్షనే లేదన్నట్లు తప్పుకుంటారు. అలా ఈసారి సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్‌, సైంధవ్‌, నా సామిరంగ సినిమాలు రిలీజయ్యాయి. అదే సమయంలో(జనవరి 12న) తమిళంలో మిషన్‌ చాప్టర్‌ 1 రిలీజైంది. దీన్ని తెలుగులోనూ విడుదల చేయాలనుకున్నారు. కానీ తర్వాత ఈ ఆలోచన విరమించుకున్నారు.

భారీ బడ్జెట్‌..
ఈ మూవీలో అరుణ్‌ విజయ్‌ హీరోగా నటించాడు. అమీ జాక్సన్‌, నిమీషా సజయన్‌ హీరోయిన్లుగా యాక్ట్‌ చేశారు. విజయ్‌ దర్శకత్వం వహించగా రూ.25 కోట్ల బడ్జెట్‌తో వంశీ, రాజశేఖర్‌ ఈ సినిమా నిర్మించారు. ఇది హీరో కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ సినిమా కావడం విశేషం. యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించారు. ఇది ఈయనకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా 100వ సినిమా కావడం విశేషం.

రెండు ఓటీటీలలో!
యాక్షన్‌ మూవీ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. సింప్లీ సౌత్‌ అనే ఓటీటీలో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అయితే ఇండియా మినహా మిగతా అన్ని చోట్ల అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా మరో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రసారం కానుందట!

చదవండి: అంబానీ ప్రీవెడ్డింగ్‌ పార్టీలో ఇతడే హైలైట్‌.. తేడా పోజులతోనే ఫేమస్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)