థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
అతడి నుంచి తప్పించుకునేందుకు రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..: నటి
Published on Fri, 04/03/2026 - 11:16
లైంగిక వేధింపుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు రెండో అంతస్తు నుంచి దూకానంటోంది బుల్లితెర నటి, హిందీ బిగ్‌బాస్ 13వ కంటెస్టెంట్ ఆర్తి సింగ్. అప్పుడు తన వయసు కేవలం 13 ఏళ్లేనని చెప్తోంది. చిన్న వయసులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆర్తి సింగ్ మాట్లాడుతూ.. అప్పుడు నాకు 13 ఏళ్లు. మా ఇంట్లో పనిచేసే వ్యక్తి నాపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు.
చేతులు జోడించి బతిమాలినా..
నేను మంచి నిద్రలో ఉండగా నా గదిలోకి నడుచుకుంటూ వచ్చాడు. నా గదిలోకి ఎందుకు వచ్చావని గొడవపడ్డాను. నాపైకి వస్తుంటే నువ్వు నా అన్నయ్యవి కదా, ప్లీజ్ వెళ్లిపో అని రెండు చేతులు జోడించి వేడుకున్నాను. అతడు నా మాట వినలేదు. నేను బయట వరండా వైపు చూస్తే తలుపులు తాళం వేసి ఉన్నాయి. అమ్మ పొలానికి వెళ్లింది, ఇంట్లో ఒంటరిగా ఉన్నాను.
రెండో ఫ్లోర్ నుంచి దూకేశా..
అక్కడ వాతావరణం భయానకంగా మారింది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. నేను వెంటనే అతడి నుంచి తప్పించుకుని రెండో అంతస్తుకు పరిగెత్తి అక్కడి నుంచి కిందకు దూకేశాను. నేను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను కాబట్టే ఆ రోజు నాపై ఏ అఘాయిత్యం జరగకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను అంది. ఆర్తి సింగ్.. గృహస్తి, పరిచయ్, ఉత్తరన్, దేవోన్ కే దేవ్.. మహాదేవ్, వారిస్, విక్రమ్ బేతాళ్‌కీ రహస్య గాథ వంటి పలు హిందీ సీరియల్స్‌లో నటించింది. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌లో నాలుగో రన్నరప్‌గా నిలిచింది.
చదవండి: పెళ్లయిన నెలకే ముగ్గురమయ్యాం అంటూ రష్మిక పోస్ట్
Tags : 1