Breaking News

మళ్లీ పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్

Published on Tue, 04/22/2025 - 21:11

'బుట్టబొమ్మ' పాట గుర్తుందా? దీన్ని పాడిన సింగర్ అర్మాన్ మాలిక్.. చాలా చిన్న వయసులోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో పాడుతూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఇతడు.. ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకున్నాడు. అసలేంటి విషయం?

ఉత్తరాదికి చెందిన అర్మాన్ మాలిక్.. 2023 ఆగస్టులో తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ప్రకటించాడు. యూట్యూబర్ ఆష‍్నా ష్రాఫ్ తోనే తాను ఒక్కటి కాబోతున్న విషయాన్ని బయటపెట్టాడు. గతేడాది డిసెంబరు చివరలో పెళ్లి జరగ్గా.. ఈ జనవరిలో పెళ్లి ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. దీంతో అందరూ శుభాకాంక్షలు చెప్పారు.

(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)

కట్ చేస్తే ఇప్పుడు మరోసారి తన ఇంటిలో పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే ఈసారి తన పెళ్లిని రిజిస్టర్ చేయించాడు. ఈ సందర్భంగా మరోసారి ఇంటిలోనే దండలు మార్చుకుని చిన్నపాటి వేడుకలా చేసుకున‍్నాడు. ఇందులో అర్మాన్ తల్లిదండ్రులతో పాటు సోదరుడు అమాల్ మాలిక్ కూడా కనిపించాడు.

కొన్నిరోజుల క్రితం తాను తన కుటుంబం నుంచి విడిపోయానని అర్మాన్ సోదరుడు అమాల్ మాలిక్ పోస్ట్ పెట్టాడు. కానీ ఇ‍ప్పుడు కుటుంబంతో కలిసి అమాల్ కనిపించాడు. గతంలో పెట్టిన పోస్ట్ కూడా డిలీట్ చేశాడు. ఇప్పుడు అర్మాన్ తన లేటెస్ట్ పెళ్లి ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేయడం విశేషం.

(ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన టాలీవుడ్ స్టార్ సింగర్)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)