Breaking News

సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా

Published on Sun, 05/11/2025 - 17:39

మరో కొత్త తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీకెండ్ దాదాపు 30కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. వీటిలో ఓదెల 2, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్ తదితర తెలుగు చిత్రాలు ఉన్నాయి. వీటితో పాటు కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ కూడా ఎలాంటి హడావుడి లేకుండా డిజిటల్ గా అందుబాటులోకి వచ్చింది.

కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. తల్లి కొడుకు సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో తీసిన ఈ చిత్రం ఏప్రిల్ 18న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ కి ముందు చాలా హడావుడి చేశారు గానీ మూవీలో అంత సీన్ లేకపోయేసరికి ఓ మాదిరి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'రాబిన్ హుడ్' సినిమా) 

ఇకపోతే ఇప్పుడు మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ.. యూకేలో ఉన్నవాళ్లు అద్దె విధానంలో మాత్రమే చూడొచ్చు. రాబోయే శుక్రవారం లేదా గురువారం ఇండియాలో అందుబాటులోకి రావొచ్చేమో?

‍అర్జున్ సన్నాఫ్ వైజయంతి విషయానికొస్తే.. సీన్సియర్ పోలీస్ ఆఫీసర్  వైజయంతి (విజయశాంతి). ఈమెకు ఓ కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్). ఐపీఎస్ అవ్వడానికి రెడీగా ఉన్న ఇతడు.. తండ్రిని ఓ క్రిమినల్ చంపేశాడని పగతో రగిలిపోతుంటాడు. తల్లికి ఇదంతా ఇష్టముండదు. అనుకోని పరిస్థితిలో అర్జున్ ఆ హంతకుడిని అందరూ చూస్తుండగా చంపుతాడు. అప్పటి నుంచీ తల్లీకొడుకుల మధ్యలో ఒక గ్యాప్. చివరకు ఏమైంది? తల్లికొడుకులు కలిశారా? అనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)