Breaking News

మూడేళ్ల గ్యాప్‌, అయినా తగ్గేదేలే.. రెమ్యునరేషన్‌ డబుల్‌..

Published on Sun, 08/20/2023 - 15:52

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ అనుష్క ఈ మధ్య సినిమాల స్పీడు తగ్గించేసింది. 2019లో చిరంజీవి సైరా సినిమాతో వెండితెరపై మెరిసింది స్వీటి. 2020లో నిశ్శబ్ధం అనే సినిమా చేసినా ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. అంటే అనుష్క సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించి మూడేళ్లవుతోంది. చాలాకాలం తర్వాత ఆమె యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్‌ 7న రిలీజ్‌ కానుంది.

రెమ్యునరేషన్‌ డబుల్‌
గతంలో అనుష్క సినిమాకు మూడు కోట్ల మేర పారితోషికం తీసుకుంది. అయితే అది అప్పటి ముచ్చట అని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె తన రెమ్యునరేషన్‌ డబుల్‌ చేసినట్లు తెలుస్తోంది. మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి చిత్రానికిగాను ఆమె ఆరు కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు ఓ వార్త వైరలవుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎంత సంపాదించమన్నది కాదు ముఖ్యం.. సినీ పరిశ్రమలో ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నామన్నదే ప్రధానం అనే మాటను నమ్ముతుంది స్వీటీ.

డబ్బు కన్నా మనుషులే ముఖ్యం
గతంలో ఈ పారితోషికం గురించి అనుష్క మాట్లాడుతూ.. 'ఒక నటి 100 చిత్రాల్లో నటించడం, కోట్లు సంపాదించడం, చాలా ఏళ్లు కథానాయకిగా పరిశ్రమలో నిలదొక్కుకోవడం లాంటివి పెద్ద విషయాలు కావు.. కానీ ఎంతమంది ఫ్రెండ్స్‌కు సంపాదించుకున్నదే ముఖ్యం. డబ్బు ఆర్జించడం కంటే మంచి మనుషుల్ని సంపాదించడం గొప్ప విషయం. నాకు పారితోషికం ప్రధానం కాదు. మంచి కథా పాత్రలో నటించాలన్నదే నా కోరిక' అని పేర్కొంది.

చదవండి: గ్లామర్‌ క్వీన్‌ మాలశ్రీ కూతుర్ని చూశారా? అందంలో అమ్మను మించిపోయేలా ఉందిగా!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)