Breaking News

రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం అదేనా?

Published on Fri, 06/21/2024 - 09:26

స్వీటీ అనే పేరు చెప్పగానే అందరికీ అనుష్క శెట్టినే గుర్తొస్తుంది. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుంచి తెలుగులో మూవీస్ చేస్తోంది. 'బాహుబలి'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆడపాదడపా మాత్రమే మూవీస్ చేస్తోంది. అలాంటిది ఈమెకు కొన్నాళ్ల క్రితం ఏకంగా రూ.5 కోట్ల ఆఫర్ వచ్చిందట. కానీ దాన్ని స్వీటీ రిజెక్ట్ చేసిందట. ఇంతకీ దీని సంగతేంటి?

కన్నడ బ్యూటీ అనుష్క.. నాగార్జున 'సూపర్' సినిమాతో నటిగా మారింది. కెరీర్ ప్రారంభంలో స్పెషల్ సాంగ్స్ చేసింది. కానీ ఆ తర్వాత హీరోయిన్‌గా చిన్నా పెద్దా హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. 'బాహుబలి' ఈమెకి ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. కానీ 'సైజ్ జీరో' మూవీ ఎప్పుడైతే చేసిందో ఈమెకు అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమా కోసం బరువు పెరిగింది కానీ తగ్గలేకపోయింది. దీంతో పూర్తిగా బయట కనిపించడమే మానేసింది.

(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)

గత కొన్నాళ్ల నుంచి మహిళా ప్రాధాన్య చిత్రాలు చేస్తూ వస్తున్న అనుష్క.. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో తలో మూవీ చేస్తోంది. ఇవి రెండు కూడా కాస్త డిఫరెంట్ మూవీస్. అయితే కొన్నాళ్ల క్రితం తెలుగు స్టార్ సినిమాలో ఆఫర్ ఈమె దగ్గరకు వచ్చిందట. రూ.5 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇ‍స్తామన్నారట. కానీ అనుష్క నో చెప్పేసిందట.

ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వల్లే అనుష్క నో చెప్పిందని అంటున్నారు. దీనిబట్టి చూస్తే అనుష్క ఎన్నాళ్లు నటిస్తుందో తెలియదు గానీ ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం పాత్ర ప్రాధాన్యమున్న మూవీసే చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏదేమైనా అనుష్క.. కోట్లు విలువ చేసే ఆఫర్ వదులుకుందనే న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: 'నింద' సినిమా రివ్యూ)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)