Breaking News

సర్‌ప్రైజ్‌ న్యూస్‌.. మరో పాన్ ఇండియా సినిమాలో అనుష్క.. గ్లింప్స్‌ విడుదల

Published on Fri, 09/01/2023 - 09:01

అరుంధతితో తిరుగులేని విజయాన్ని అందుకున్న అనుష్క… జేజెమ్మగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ సినిమా ఆమె సినీ జీవితానికే ఓ మలుపుగా చెప్పుకోవచ్చు.. ఆ తర్వాత బాహుబలి ఫ్రాంచైజ్‌తో ఆమెకు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు దక్కింది. ఇలా టాలీవుడ్‌ నుంచి పాన్ ఇండియా వరకు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకుంది. కానీ సైజ్‌ జీరో సినిమా నుంచి చాలా గ్యాప్ తీసుకొని నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసింది. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.

(ఇదీ చదవండి: 'జైలర్‌'కు భారీగా లాభాలు.. రజనీకి మరో చెక్‌ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?)

ఇదిలా ఉండగా అనుష్క శెట్టి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో జాయిన్ అయింది. మలయాళ చిత్ర సీమ నుంచి వస్తున్న ఫాంటసీ హారర్ డ్రామా 'కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్' సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను తాజాగ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో జాతీయ అవార్డు అందుకున్న మలయాళ టాప్‌ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు అధికారికంగా మేకర్స్‌ వెల్లడించారు.

(ఇదీ చదవండి: నేనూ ఒకమ్మాయిని ప్రేమించాను.. కానీ ఆమె మరో హీరోతో .. : విజయ్‌ సేతుపతి)

ఈ మూవీకి రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.  మొత్తం 14 భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం. వచ్చే ఏడాది (2024)లో పార్ట్‌-1 విడుదల కానుందని వెల్లడించారు. సుమారు రెండు నిమిషాల పాటు ఉన్న ఈ గ్లింప్స్‌ వెన్నులో వణుకు పుట్టించేలా విజువల్స్‌ ఉన్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)