Breaking News

'ఐ లవ్‌ యూ' చెబితే ఓకే చెప్పేశాను: అనుష్క

Published on Thu, 07/10/2025 - 06:33

నటి అనుష్క( Anushka Shetty). ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది అరుంధతి, బాహుబలి చిత్రాలే. నిజానికి ఈ మంగళూరు బ్యూటీ అంతకుముందు చాలా హిట్‌ చిత్రాల్లో నటించారు. వాటిలో ఎక్కువగానే గ్లామరస్‌ పాత్రలు పోషించి అభిమానులను కనువిందు చేశారు. ముఖ్యంగా 'రెండు' అనే తమిళ మూవీతో పాటు 'బిల్లా'లో స్విమ్మింగ్‌పూల్‌ సీన్‌ కోసం ఆమె అందాల ఆరబోతకు యూత్‌ ఫిదా అయ్యారు. అయితే ఆమెలోని నట విశ్వరూపాన్ని తెరపై ఆవిష్కరించిన తొలి చిత్రం మాత్రం అరుంధతినే. ఆ తరువాత అనుష్క పయనమే మారిపోయింది. ఏ చిత్రంలోనైనా ఒక హీరోయిన్‌ పాత్రను చూస్తే ఆ పాత్రలో అనుష్క అయితే ఇంకా బాగా నటించేవారు అని అనుకునే ఉన్నత శిఖరాలకు చేరుకున్న నటి ఆమె. 

ఒక పాత్ర కోసమే బరువు పెంచుకున్న నటి ఎవరైనా ఉన్నారంటే అది అనుష్కనే అవుతారు. అలాంటి అద్భుత నటి వయసు ఇప్పుడు 43 ఏళ్లు. అయినా అవివాహితగానే ఉన్నారు. ఈమె ప్రేమ గురించి చాలా వదంతులు దొర్లుతూనే ఉన్నాయి. కాగా చాలా మందికి బాల్యంలో లవ్‌ స్టోరీస్‌ ఉంటాయి. అనుష్క బాల్యంలోనే ఒక లవ్‌ స్టోరీ ఉందట. ఈ విషయాన్ని తనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడం విశేషం. ‘నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు అదే తరగతి చదువుతున్న సహ విద్యార్థి నా వద్దకు వచ్చి ఐ లవ్‌ యూ’ అని చెప్పాడు. 

ఆ వయసులో ఐ లవ్‌ యూ అంటే ఏమిటో కూడా తెలియదు. అయినా అతనికి ఓకే అని చెప్పాను. ఆ విషయం గుర్తుకు వస్తే ఇప్పటికీ మధురమైన అనుభూతిని కలిగిస్తుంది అని అన్నారు. కాగా చిన్న గ్యాప్‌ తరువాత అనుష్క కథానాయికగా నటించిన ఘాటీ త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా అనుష్క తొలిసారిగా మలయాళంలో నటిస్తున్న చిత్రం షూటింగ్‌ దశలో ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)