Breaking News

ఓటీటీకి క్రేజీ కల్యాణం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published on Mon, 11/09/2026 - 06:35

అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ ఉడ్డెమారి ప్రధాన  పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ కల్యాణం. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌ మోహన్‌రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబర్ 16న విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ రివీల్ చేశారు. అయితే స్ట్రీమింగ్ ఎప్పుడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కమింగ్ సూన్ అంటూ క్రేజీ కల్యాణం పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేయనున్నారు.

కథేంటంటే..
మెదక్ జిల్లాకు చెందిన పర్వతాలు(నరేష్)కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకుంటాడు. అల్లుడు బాలరాజు(తరుణ్‌ భాస్కర్‌) పెద్ద తాగుబోతు. నిత్యం తాగుతూ..ఊర్లో వాళ్ళతో గొడవలు చేసి మామ పరువు తీస్తుంటాడు. దీంతో తన చిన్న కూతురు కీర్తి కు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పోయిన తన పరువుని కాపాడుకోవాలనుకుంటాడు.

కానీ కీర్తి కాలేజీ లో ఉదయ్(అఖిల్‌ రాజ్‌)ని ప్రేమిస్తుంది. బాగా చదువుకొని జాబ్ వచ్చిన తరువాత ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఈ లోపు నాన్న పర్వతాలు ఒక అమెరికా సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. నాన్న కోరిక మేరకు కీర్తి ఆ అమెరికా సంబంధం ఓకే చేసిందా? లేదా ప్రేమించిన ఉదయ్‌ని పెళ్లి చేసుకుందా? బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలకున్న తన లక్ష్యం నెరవేరిందా? లేదా? కూతురి ప్రేమ విషయం తెలిసిన తర్వాత పర్వతాలు ఏం చేశాడు? చివరకు కీర్తి పెళ్లి ఎవరితో జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)