Breaking News

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రేమలో బ్రేకప్?

Published on Sun, 07/19/2026 - 20:55

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, డేటింగ్, పెళ్లి, బ్రేకప్, విడాకులు లాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి కొన్నాళ్ల క్రితం ప్రేమ వార్తలు వైరల్ అయ్యాయి. తమిళ హీరో ధ్రువ్ విక్రమ్‌తో డేటింగ్ చేస్తుందనే టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అతడికి బ్రేకప్ చెప్పేసిందా అని సందేహం కలుగుతోంది. అనుపమ పెట్టిన తాజా పోస్ట్ దీనికి కారణం.

(ఇదీ చదవండి: 'స్పిరిట్' క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా)

స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న అనుపమ.. తమిళంలోనూ పలు మూవీస్ చేసింది. అయితే 'బైసన్' చేస్తున్న టైంలో హీరోహీరోయిన్లు అయిన ధ్రువ్ విక్రమ్, అనుపమ మధ్య నిజ జీవితంలో ప్రేమ పుట్టిందనే టాక్ బయటకు వచ్చింది. అందుకు తగ్గట్లే కొన్ని వ్యక్తిగత ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే ఇది నిజమా కాదా అనే సంగతి పక్కనబెడితే లేటెస్ట్‌గా అనుపమ.. బ్రేకప్ తర్వాత తనకు స్వాతంత్ర్యం వచ్చిందనే అర్థం వచ్చేలా ఓ క్యాప్షన్ పెట్టింది.

ఫొటోలు పోస్ట్ చేసినందుకు సారీ చెబుతూ.. ఇది పెట్టేముందు ఎవరి అనుమతి అడగాల్సిన అవసరం లేకపోయిందని, వీటికి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ సెలక్షన్ కోసం, ఇంకెవరో క్యాప్షన్ పెడతారని ఎదురుచూడటం లాంటివేం లేవని అనుపమ క్యాప్షన్ పెట్టింది. ఇక మరో పోస్టులో.. ఈ రోజు  ప్రశాంతత నన్ను చేరుకుంది. ఒకప్పుడు నాదేనని మరిచిపోయిన జీవితాన్ని మరోసారి ప్రేమించడం ప్రారంభించా. మీ అందరినీ నేను ఎంతో ప్రేమిస్తున్నా. ఇకపై నా జీవితం పూర్తిగా నాదే అని రాసుకొచ్చింది. దీంతో అనుపమ బ్రేకప్ రూమర్స్ నిజమేనా అని మాట్లాడుకుంటున్నారు.

అనుపమ సినిమాల విషయానికొస్తే.. ఈ మధ్యే 'మరీచిక', లాక్ డౌన్ లాంటి సినిమాలతో వచ్చింది గానీ ఫ్లాప్స్ ఎదుర్కొంది. ప్రస్తుతం శర్వానంద్ సరసన 'భోగి' మూవీ చేస్తోంది. ఇది ఆగస్టులో థియేటర్లలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్)

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)