Breaking News

కొందరి జీవితాలు అంతే.. ప్రకాశ్ రాజ్‌కు అనుపమ్ ఖేర్ గట్టి కౌంటర్..!

Published on Sat, 02/18/2023 - 15:37

ది కాశ్మీర్ ఫైల్స్‌ సినిమాపై వివాదం ఇంకా ముగిసిపోలేదు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై దుమారం మరింత రాజుకుంటోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌కు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చారు. ది కశ్మీర్ ఫైల్స్ ఓ నాన్‌సెన్స్‌ ఫిల్మ్ అన్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళలో జరిగిన ఓ ఈవెంట్‌లో ది కాశ్మీర్ ఫైల్స్‌ ఓ నాన్సెన్స్ ఫిల్మ్‌ అంటూ ప్రకాశ్ రాజ్ ఘాటుగా వ్యాఖ్యనించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ జ్యూరీనే వారి సినిమాపై ఉమ్మివేసిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

అయితే తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. తన జీవితమంతా ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాతానని ఆయన చెప్పారు. కొంతమంది అ‍బద్ధాలతో తమ జీవితాన్ని వెల్లదీస్తున్నారని ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. 

అనుపమ్ ఖేర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ' కొందరు మనుషులు తమ స్థాయిని తగ్గట్లు మాట్లాడతారు. కొంతమంది మాత్రం తమ జీవితమంతా అబద్ధం చెబుతారు. మరికొందరు నిజాలే మాట్లాడతారు. నా జీవితమంతా నిజం మాట్లాడిన వారిలో నేనూ ఒకడిని. అబద్ధాలు చెబుతూ జీవించాలనుకోవడం అది వారి కోరిక.' అంటూ ప్రకాశ్‌ రాజ్‌కు గట్టిగా కౌంటరిచ్చారు. 

కాగా.. గతేడాది విడుదలైన ది కాశ్మీర్ ఫైల్స్ 1990లలో కశ్మీరీ హిందువుల వలసలను ఈ చిత్రంలో చూపించారు.వివేక్ అగ్నిహౌత్రి దర్శకత్వంలో జీ స్టూడియోస్ నిర్మించారు. ఈ చిత్రంలో అనుపమ్ ప్రధాన పాత్రలో పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ తదితరులు నటించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)