Breaking News

అందరూ మర్చిపోయిన టైంలో 'అన్నగారు' ఓటీటీలోకి

Published on Wed, 03/04/2026 - 10:57

తమిళ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్లే ఇతడి సినిమాలు రెండు భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ అవుతుంటాయి. అయితే గత చిత్రం మాత్రం కేవలం తమిళం వరకే పరిమితమైంది. దానికి చాలానే కారణాలున్నాయి. ఈ మూవీ అటు థియేటర్లలో రిలీజైంది. ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌లోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ మళ్లీ ఎందుకు ఓటీటీలో విడుదల చేస్తున్నారు? ఏమైంది?

(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)

దాదాపు రెండు మూడేళ్లుగా సెట్స్‌పై ఉన్నకార్తీ సినిమా 'వా వాతియర్'. లెక్ ప్రకారం గతేడాది డిసెంబరు 5నే రిలీజ్ కావాలి. కానీ ఓ ఫైనాన్సియర్.. ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై కోర్టులో కేసు వేయడంతో వాయిదా పడింది. ఆయనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తేనే మూవీ రిలీజ్ ఉంటుందని, లేదంటే అప్పటివరకు కష్టమే అని కోర్టు చెప్పింది. దీంతో తప్పని పరిస్థితుల్లో డబ్బులు కట్టారు. అప్పటికే డిసెంబరు దాటిపోయింది. సంక్రాంతికి రావాల్సిన 'జన నాయగణ్' వాయిదా పడేసరికి ఆదరబాదరాగా జనవరి 14న తమిళనాడులోని థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేశారు. కానీ తొలి ఆటకే ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చింది.

కట్ చేస్తే రెండు వారాలు తిరిగేసరికల్లా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి కూడా 'వా వాతియర్' సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే తమిళ వెర్షన్ కోసం సిద్ధం చేసిన ప్రింట్‌నే తెలుగు వెర్షన్ కోసమూ రిలీజ్ చేశారు. దీంతో తెరపై బొమ్మ ఎమ్‌జీఆర్ కనిపిస్తుంటే.. డైలాగ్స్‌లో మాత్రం ఎన్టీఆర్ అని వినిపించేది. దీంతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఫొటోలతో ఉన్న ప్రింట్‌ని లేటెస్ట్‌గా ఈ శుక్రవారం(మార్చి 06) నుంచి స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అయితే అందరూ దాదాపుగా ఈ మూవీ గురించి మర్చిపోయిన టైంలో దీన్ని తీసుకురావడం వల్ల ఉపయోగం అయితే ఉండకపోవచ్చనే అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'కి లైన్ క్లియర్.. 'టాక్సిక్' వాయిదా)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)