Breaking News

'హీరోతో లవ్‌.. వ్యాపారవేత్తతో పెళ్లి'.. అంజలి ఆన్సరిదే!

Published on Thu, 01/11/2024 - 12:06

పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్న సామెత మాదిరిగా సెలబ్రిటీల గురించి ముఖ్యంగా సినీ హీరోయిన్‌ల గురించి సోషల్‌ మీడియాలో లేనిపోనివి రాసేస్తుంటారు. అంజలి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ అచ్చ తెలుగమ్మాయి ఫొటో చిత్రం ద్వారా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమైంది. రామ్‌ దర్శకత్వంలో 'కట్రదు తమిళ్‌' చిత్రం ద్వారా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అంజలి అక్కడ తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత తనకు తమిళంలో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. దీంతో అంజలి అక్కడ బిజీ హీరోయిన్‌గా మారింది.

స్టార్‌ హీరోలతో జోడీ
అలాంటి సమయంలోనే పిన్నితో మనస్పర్థలు తలెత్తడంతో హైదరాబాద్‌కు మకాం మార్చింది. ఇది ఈమెకు ప్లస్సే అయ్యిందని చెప్పవచ్చు. ఇక్కడ వెంకటేశ్‌, బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోలతో జత కట్టే అవకాశాలు అందుకుంది. ఇకపోతే హీరో జైతో ప్రేమాయణం.. పెళ్లికి సిద్ధం అవుతున్న అంజలి అంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. దాన్ని అప్పట్లోనే అంజలి లైట్‌ తీసుకుంది. ఇప్పుడేమో.. ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్‌ అయిందని ప్రచారం జరుగుతోంది.

తెలియకుండానే పెళ్లి చేస్తున్నారు!
దీనిపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అంజలి సినిమా రంగంలో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పింది. దీంతో తనను ఎవరితో కలిపి రాయాలన్నది కొందరు వారే సొంతంగా నిర్ణయించుకుని రాసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మొదట్లో హీరో జైను ప్రేమిస్తున్నట్లు రాశారని, ఇప్పుడు ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్‌ అయినట్లు ప్రచారం జరుగుతోందని తెలిపింది. తనకు తెలియకుండానే తన పెళ్లి చేసేస్తుండడంతో నవ్వు వస్తోందని పేర్కొంది. తమిళంలో ఈమె నటించిన ఏళు కడల్‌ ఏళు మలై చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. మరోవైపు గీతాంజలి 2 కూడా త్వరలో రిలీజ్‌ కానుంది.

చదవండి: షూటింగ్‌లో గాయపడ్డ హీరో నితిన్‌?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)