Breaking News

Animal OTT Release: నేడు అర్థరాత్రి నుంచి ఓటీటీలోకి 'యానిమల్‌'

Published on Thu, 01/25/2024 - 13:30

బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్ నటించిన సూపర్‌హిట్‌ మూవీ 'యానిమల్‌'. సందీప్‌ రెండ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్‌తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు  అధికారికంగా ప్రకటన వచ్చింది. 

యానిమల్‌ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్‌ అవుతుందని ఎదురు చూసిన ‍ప్రేక్షకులకు తాజగా నెట్‌ఫ్లిక్స్‌ ఒక టీజర్‌ విడుదల చేసి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో యానిమల్‌ చిత్రం ఉంటుందని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. ఈమేరకు చిన్న గ్లింప్స్‌ వదిలింది. అయితే ఈ వీడియో చివర్లో 'రూ.199 చెల్లించి చూడండి' అని సూచించింది. అంటే ఇది నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ వివరాలా? లేదంటే అద్దె పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు హింటిచ్చిందా? అన్నది అర్థం కాక నెటిజన్లు అయోమయానికి లోనవుతున్నారు.

యానిమల్‌ రన్‌టైమ్‌ 3:21 గంటలు కానీ ఓటీటీ కోసం అదనపు సీన్లు యాడ్‌ చేస్తున్నట్లు చిత్ర టీమ్‌ తెలిపింది. దీంతో ఈ సినిమా మూడున్నర గంటల నిడివి ఉండనుంది. 'యానిమల్‌ పార్క్‌' టైటిల్‌తో ఈ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మిస్తున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి‌ వంగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)