Breaking News

నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్‌ రావిపూడి

Published on Tue, 05/31/2022 - 13:00

Anil Ravipudi Says I Have 3 Families Comments Viral In F3 Success Meet: విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, బ్యూటిఫుల్‌ హీరోయిన్స్‌ మెహరీన్‌, సోనాల్‌ చౌహన్‌ కలిసి నటించిన ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ మూవీ 'ఎఫ్ 3' (F3). ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. మే 27న విడుదలైన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు ఆడియెన్స్‌. ఇప్పటివరకు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. 

ఈ సక్సెస్‌ మీట్‌లో డైరెక్టర్ అనిల్‌ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'థంబ్‌నేయిల్స్‌ పెట్టుకోండి. నాకు మూడు ఫ్యామీలులు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంటే మరో ఫ్యామిలీ ఇక్కడున్న నా చిత్రబృందం. అలాగే నా మూడో కుటుంబం ప్రేక్షకులు.' అని అనిల్‌ రావిపూడి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ‘‘కరోనా తర్వాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘భీమ్లానాయక్‌’, ‘సర్కారు వారి పాట’ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకుని వచ్చాయి. ఇప్పుడు ‘ఎఫ్‌ 3’ తీసుకొచ్చింది. విడుదలైన రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురుస్తోంది. నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అని అనిల్‌ రావిపూడి పేర్కొన్నారు.

చదవండి: అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్‌ అలీ
భార్యతో కలిసి నటించిన యశ్‌ సినిమా.. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)