మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
వెంకీమామ- అనిల్ రావిపూడి కాంబో.. బీచ్‌లో క్రేజీ అప్‌డేట్
Published on Fri, 06/12/2026 - 18:51
ప్రతి సంక్రాంతికి హిట్ కొడుతున్న టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఏడాది కూడా మనశంకరవరప్రసాద్‌గారు మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. చిరంజీవి- వెంకీతో కలిసి ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. వీరిద్దరి కాంబోలో బాగానే వర్కవుట్ అయింది. ఇద్దరు స్టార్స్‌ను తీసుకుని కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించడం ఒక్క అనిల్ రావిపూడికే సాధ్యమని టాలీవుడ్ సినీ ప్రియులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకీమామతో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్.. మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు వచ్చేస్తున్నారు. వెంకీతో పాటు కల్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ దాదాపు రెడీ అయిపోయింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రోటీన్‌గా కాకుండా చాలా క్రేజీగా అనౌన్స్ చేశారు. వివాహ భోజనంబు చిత్రంలోని సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం మధ్య బీచ్‌లో జరిగే ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఆడియన్స్‌ను అలరిస్తోంది. ఆ సినిమాలో లాగే బీచ్‌లో జీవీ ప్రకాశ్‌ను ఇసుకలో పూడ్చి మరి మ్యూజిక్ కంపోజ్ చేయించారు. ఆ తర్వాత పాటల రచయితగా అనంత శ్రీరామ్ పని చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే అప్‌డేట్స్‌తో అనిల్ రావిపూడి సరికొత్తగా దూసుకెళ్తున్నారు. దీంతో వెంకీ మామ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
I've always admired @gvprakash's ability to make music that connects instantly with audiences.👌🏻
Thrilled to welcome him on board for #VenkyAnil5 - #NKRAnil2 🤗
And we had a blast pulling off this fun concept...
A big thank you to GV for trusting the idea, joining in… pic.twitter.com/AeAMx5hJbd— Anil Ravipudi (@AnilRavipudi) June 12, 2026
Tags : 1