Breaking News

చిరంజీవి లుక్‌లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి

Published on Fri, 08/22/2025 - 13:25

గతంలో సినిమాని సినిమాగా చూసి ఎంటర్‌టైన్ అ‍య్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రాఫిక్స్, లాజిక్కులు, హీరో లుక్.. ఇలా అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఏ మాత్రం తేడా అనిపించినా సరే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. రీసెంట్ టైంలో హరిహర వీరమల్లు, వార్ 2 చిత్రాలు ఇలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నాయి. గతేడాది 'విశ్వంభర' కూడా టీజర్‌తో చాలానే విమర్శలు ఎదుర్కొంది.

అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి.. తన కొత్త సినిమా విషయంలో ముందే జాగ్రత్త పడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ డైరెక్టర్.. చిరంజీవితో ఓ కామెడీ మూవీ చేస్తున్నాడు. చిరు బర్త్ డే సందర్భంగా తాజాగా టైటిల్ రివీల్ చేశారు. 'మన శంకర వరప్రసాద్ గారు' అని టైటిల్ పెట్టినట్లు చెబుతూ ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సిగరెట్ తాగుతూ సూట్ వేసుకుని చిరంజీవి స్టైలిష్‌గా కనిపించారు.

(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)

అయితే చిరు లుక్‌పై ట్రోల్స్ వస్తాయని భయపడ్డాడో ఏమో గానీ అనిల్ రావిపూడి.. 'చిరంజీవి సూట్‌లో ఎలా ఉంటారో చూడటం నాకు చాలా ఇష్టం. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా చాలా లుక్స్ ఉన్నాయి. చిరంజీవి లుక్‌కి VFX ఏమి లేదు.. 95 శాతం ఒరిజినల్' అని చెప్పుకొచ్చాడు. ఈ మూవీ కోసం జిమ్‌కి వెళ్లి సన్నబడ్డారని చెప్పుకొచ్చాడు. అనిల్ స్పీచ్ చూస్తుంటే ట్రోల్స్ వచ్చి తర్వాత క్లారిటీ ఇవ్వడం కంటే ముందే జాగ్రత్తపడుతున్నాడేమో అనిపిస్తుంది.

ఈ సినిమాలో నయనతార హీరోయిన్ కాగా భీమ్స్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేశారు. లెక్క ప్రకారం చిరంజీవి 'విశ్వంభర' ఈ మూవీ కంటే ముందు రిలీజ్ కావాలి. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా వేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ కొత్త సినిమా.. తెలుగులోనూ)

Videos

జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్

అమెరికాలోని పెంబ్రోక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

అబ్బయ్య చౌదరిని చంపితే? వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు వస్తారు.. పేర్ని నాని సంచలన కామెంట్స్

తమిళనాట విజయ్ వ్యూహం.. ఎలా ఉండబోతోంది?

వాడు తేడా.. అమ్మాయిల పిచ్చి.. ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్

TDP నేత సంచలన ఆడియో.. తిరుపతి ఇంచార్జి మంత్రి జల్సాలు.. లాడ్జీల్లో సరసాలు..

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

మీ చేతికి రెండు కోట్లు.. పరారీలో ఉన్న ఖైదీకి పెరోల్.. అసలు సంగతి ఇదీ

పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోన్న కూటమి సర్కార్

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు

Photos

+5

జర్మనీ : గుమ్మడికాయల ప్రదర్శన అదరహో (ఫొటోలు)

+5

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఘనంగా వరలక్ష్మీ వత్రాలు (ఫొటోలు)

+5

జపాన్‌లో చిల్ అవుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

పద్మనాభస్వామి ఆలయ వేడుకలో మోహన్ లాల్ (ఫొటోలు)

+5

శ్రీవారితో అందమైన జర్నీకి ఏడాది! వరాహరూపం సింగర్‌ శ్రీలలిత (ఫొటోలు)

+5

'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్‌ గ్లింప్స్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ట్రెండింగ్‌ ఫోటోలు చూశారా..?

+5

#HBDChiranjeevi : 70 ఏళ్ల గాడ్‌ ఫాదర్‌.. 'చిరంజీవి' బర్త్‌డే స్పెషల్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో సందడి చేసిన సినీ నటి శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఇవి మీకు తెలుసా? (ఫొటోలు)