Breaking News

అదిరే అభి నా సినిమాకు సాయం చేశాడు: అనిల్‌ రావిపూడి

Published on Thu, 11/06/2025 - 11:27

‘‘గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ’ సినిమాకి నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. ఆ చిత్రంలో అభి మంచి పాత్ర చేశాడు. మేము చాలా ఏళ్లు బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. కందిరీగ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులు రాసేందుకు అభి సాయం చేశాడు. అదిరే అభిగా ‘జబర్దస్త్‌’తో తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు దర్శకుడిగానూ ‘చిరంజీవ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. రాజ్‌ తరుణ్‌కు ఈ సినిమా మంచి కమ్‌ బ్యాక్‌ కావాలి. ‘చిరంజీవ’ చిత్రం ఘన విజయం సాధించాలి’’ అని డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తెలిపారు. 

ఆహాలో చిరంజీవ మూవీ
రాజ్‌ తరుణ్, కుషిత కల్లపు జోడీగా నటించిన చిత్రం ‘చిరంజీవ’ (Chiranjeeva Movie). అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. రాహుల్‌ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ సినిమా ప్రీమియర్‌ షోకి, ప్రెస్‌ మీట్‌కి అనిల్‌ రావిపూడి అతిథిగా హాజరయ్యారు. 

పన్నెండేళ్లుగా ట్రై చేస్తున్నా..
రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం కోసం అభి మా అందరి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడ్డాడు’’ అని తెలిపారు. ‘‘చిరంజీవ’ అందర్నీ నవ్విస్తుంది’’ అన్నారు రాహుల్‌ అవుదొడ్డి. అభినయ కృష్ణ మాట్లాడుతూ– ‘‘పది పన్నెండేళ్ల నుంచి దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఆహా నుంచి శ్రావణిగారికి ‘చిరంజీవ’ కథ నచ్చడంతో ఈ సినిమా తీశారు’’ అన్నారు.

చదవండి: స్పిరిట్‌లో దగ్గుబాటి హీరో? కెరీర్‌ టర్న్‌ అవడం ఖాయం!

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)