Breaking News

మంచు విష్ణు కన్నప్ప.. ఏపీలో టికెట్ ధరల పెంపు

Published on Wed, 06/25/2025 - 21:16

ఏపీలో కన్నప్ప సినిమా టికెట్‌ రేట్లు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. రిలీజ్‌ రోజు నుంచి పది రోజుల పాటు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతులు జారీ చేసింది. అయితే కేవలం హయ్యర్‌ క్లాస్‌ టికెట్‌ రేట్లు మాత్రమే పెంచుకునేందుకు సడలింపు ఇచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. టికెట్ రేటుకు అదనంగా రూ.50 పెంచుకునేందుకు ఉత్తర్వులిచ్చింది. తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా టికెట్ ధరల పెంపు కోసం ఏపీ గవర్నమెంట్‌కు మంచు విష్ణు  దరఖాస్తు చేసుకోవడంతో టికెట్ పెంపునకు అనుమతిచ్చింది.

బాలీవుడ్‌ డైరెక్టర్‌ ముకేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ ‍అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)