Breaking News

'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్విటర్‌ రివ్యూ

Published on Thu, 11/27/2025 - 08:02

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం'ఆంధ్ర కింగ్ తాలూకా'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్‌ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Andhra King Taluka Talk)

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్డ్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘రామ్‌ ఖాతాలో హిట్‌ పడిందా? ఆంధ్రకింగ్‌ తాలుకా కథేంటి? ఎలా ఉంది? తదితర అంశాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. (Andhra King Taluka Movie Twitter Review)

ఎక్స్‌లో ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. సినిమా బాగుందని..రామ్‌ వన్‌మ్యాన్‌ షో అని నెటిజన్స్‌ ట్వీట్స్‌ చేస్తున్నారు. మహేశ్‌ మరోసారి హార్ట్‌ఫుల్‌ డ్రామాని తెరకెక్కించారని ప్రశంసిస్తున్నారు. నిడివి కాస్త ఎక్కువ ఉండడం, ఫస్టాఫ్‌ నెమ్మదిగా సాగడం మైనస్‌ అని చెబుతున్నారు. 

 

 ఆంధ్రకింగ్‌ ఊహించదగ్గ ఫ్యానిజమ్‌, లవ్‌స్టోరి. నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ.. మంచి అనుభూతిని కలిగిస్తుంది. దర్శకుడు మహేశ్‌ మరో మంచి హార్ట్‌ఫుల్‌ డ్రామాని తెరకెక్కించాడు. రామ్‌ నటన అదిరిపోయింది. సినిమాలో హీరో పాత్రకి ఉపేంద్రని ఎంపిక చేయడం సరైన నిర్ణయం. అద్భుతంగా నటించాడు. ఊహకందేలా ఉన్నప్పటికీ..చాలా నిజాయితీగా ఈ కథను చెప్పారంటూ ఓ నెటిజన్‌ 2.75 రేటింగ్‌ ఇచ్చాడు.  

 

 చాలా మంచి సినిమా. ప్రతి హీరో అభిమాని ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతాడు. రైటింగ్‌ చాలా బాగుంది. సెకండాఫ్‌ అద్భుతంగా ఉంటుంది. మినింగ్‌ఫుల్‌& హార్ట్‌వార్మింగ్‌ స్టార్‌-ఫ్యాన్‌ స్టోరీ అని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు.

 ఎమోషనల్‌ అండ్‌ ఎంగేజింగ్‌ మూవీ ఇది. రామ్‌ తన ఫెర్మార్మెన్స్‌తో అదరగొట్టాడు. డైలాగులు బాగున్నాయి. పాటలు, సెంకడాఫ్‌ బ్యూటిఫుల్‌గా ఉంది. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా సాగడం మైనస్‌. ఓవరాల్‌గా ఆంధ్రకింగ్‌ చాలా బాగుంది అంటూ మరో నెటిజన్‌ 3 రేటింగ్‌ ఇచ్చాడు.

Videos

అనుచరులతో మా ఇంటికొచ్చి..! బాధితురాలు సంచలన నిజాలు

మహిళ అని కూడా చూడకుండా చీర పట్టుకొని లాక్కెళ్లి.. కాళ్లతో తన్నుతూ..!!

దళారుల రాజ్యం! ధాన్యం కొనుగోలు గందరగోళం

నా ప్రాణాలు పోయినా.. నిన్ను మాత్రం.. కోటంరెడ్డికి నెల్లూరు మేయర్ భర్త ఛాలెంజ్

రోడ్ల మరమ్మతు పేరుతో కోట్లలో డబ్బు.. బాదుడే బాదుడు

డ్రగ్స్ ముఠాను చిత్తుచేసేందుకు ఈగల్ టీమ్ బిగ్ ప్లాన్

హాంగ్ కాంగ్ అగ్ని ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

KTR : కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది

ట్రైనీ సీఎం.. నీతి ప్రవచనాలు లోకేష్ ను ఏకిపారేసిన అంబటి

దివ్యాంగులపై జోకుల కేసులో సమయ్ రైనాకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Photos

+5

సింపుల్‌గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)

+5

అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్‌ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ వివాహం (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)

+5

రాజన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

హాంకాంగ్‌లో భారీ అగ్నిప్రమాదం (ఫొటోలు)