Breaking News

మంత్రి ప్రసంగిస్తుండగా శ్రీలీల ఎంట్రీ.. అసలేం జరిగిందంటే?

Published on Wed, 06/11/2025 - 14:02

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Duddilla Sridhar Babu)కు వింత అనుభవం ఎదురైంది. సీత (షి ఈజ్‌ ది హీరో ఆల్వేస్‌ - SITHA) యాప్‌ ఆవిష్కరణ వేడుకలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో హీరోయిన్‌ శ్రీలీల అక్కడికి వచ్చేసింది. అది గమనించిన యాంకర్‌ ఝాన్సీ (Anchor Jhansi) మంత్రి ప్రసంగాన్ని కొద్ది క్షణాలపాటు ఆపింది.

మంత్రి ప్రసంగానికి ఆటంకం
మంత్రివర్యులు క్షమించాలి అంటూనే హీరోయిన్‌ శ్రీలీల (Actress Sreeleela)ను స్టేజీపైకి పిలిచింది. 'షి ఈజ్‌ ది హీరో ఆల్వేస్‌' అనే యాప్‌ లాంఛ్‌ చేస్తున్నాం. కాబట్టి.. బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ శ్రీలీలను స్టేజీపైకి ఆహ్వానిస్తున్నాం అంటూ తన ఇంట్రో ముగించింది. అలా శ్రీలీల.. స్టేజీ ఎక్కగా మంత్రి ఏమాత్రం చిరాకుపడకుండా ఆమెను నవ్వుతూ పలకరించాడు. తర్వాత తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించాడు.

సభామర్యాద పాటించరా?
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీలీల హీరోయిన్‌ అయినంత మాత్రాన.. మంత్రి ఉపన్యాసాన్ని మధ్యలో ఆపటం అర్థరహితమని, పైగా ఎంతో అనుభవమున్న యాంకర్‌ ఝాన్సీ ఇలా చేయడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. 

స్పందించిన ఝాన్సీ
ఒక వక్త ఉపన్యసించేటప్పుడు వారిని ఆటంకపరచడం అవమానించడమే అవుతుంది. సభా మర్యాద పాటించాల్సి ఉంటే బాగుండేది.. అక్కడ శ్రీధర్‌బాబు కాకుండా ఇంకా ఎవరున్నా పరిస్థితి మరోలా ఉండేది అని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై యాంకర్‌ ఝాన్సీ స్పందించింది. మంత్రి మాట్లాడుతున్న సమయంలో శ్రీలీల కార్యక్రమానికి వచ్చిందని పేర్కొంది. మంత్రి అనుమతితోనే శ్రీలీలను స్టేజీపైకి తీసుకొచ్చామంది. అంతేతప్ప ఆయన ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకోలేదని వివరణ ఇచ్చింది.

 

 

చదవండి: సుహాసిని ఫోన్‌ చేసి మరీ ఆ మాట చెప్పేసరికి షాకయ్యా: నటుడు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)