బూతు కాదు నేను పోస్ట్ చేస్తున్నది భక్తి కంటెంట్

Published on Sun, 04/19/2026 - 15:05

రీసెంట్ టైంలో ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌తో యాంకర్ విష్ణుప్రియ లాంటి వాళ్లు లక్షలు సంపాదిస్తున్నారనే విషయం హాట్ టాపిక్ అయిపోయింది. ఇందులో భాగంగా రూ.399 కడితే అర్థ నగ్న వీడియోలు పోస్ట్ చేస్తుందనే ఆరోపణలతో ఈమెపై విజయవాడలో కేసు కూడా పెట్టారు. ఈ ఫిర్యాదు మాటేమో గానీ ఈ వివాదం జరగక ముందు విష్ణుప్రియకు ఉన్న సబ్‌స్క్రైబర్స్ ఇప్పుడు ఏకంగా మూడు రెట్లు పెరిగారు. ఈమె సంగతి పక్కనబెట్టి తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్లపై పడ్డారు.

(ఇదీ చదవండి: తల్లి కాబోతున్న మరో తెలుగు సీరియల్ హీరోయిన్)

వకీల్‌సాబ్, మల్లేశం తదితర సినిమాల్లో నటించిన తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ పేరిట లక్షల సంపాదించేస్తుందని విష్ణుప్రియని వదిలేసి ఈమెపై పడ్డారు. దీంతో తప్పక ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తను ఈ సబ్‌స్క్రిప్షన్‌ని మొదలుపెట్టింది అంతా ఓ కమ్యూనిటీలా కలిసి ఉండేందుకే అని చెప్పుకొచ్చింది.

అలానే తన దినచర్యలో చేసే వాటి గురించి చెప్పేందుకే ఈ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టానని చెబుతూ.. గతేడాది ఏప్రిల్ 7వ తేదీన పోస్ట్ చేసిన వీడియోని ఇప్పుడు షేర్ చేసింది. ఈ వీడియోలో అనన్య.. ఓం నమః శివాయ మంత్రాన్ని 21 రోజులు 108 సార్లు చదివితే మనసు ప్రశాంతంగా మారుతుందని చెబుతూ కనిపించింది.

అలా 2025లోనే సబ్‌స్క్రిప్షన్‌ గురించి వీడియో చేసి రిలీజ్ చేశానంటూ అనన్య క్లారిటీ ఇచ్చింది. ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ గురించి కొన్ని అనవసరమైన కామెంట్లు చూస్తున్నానని, అందుకే వివరణ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ వీడియో ద్వారా తను సబ్‌స్క్రిప్షన్‌లో గ్లామరస్ ఫొటోలు గానీ, బూతు కంటెంట్ గానీ పోస్ట్ చేయట్లేదని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఇప్పుడైనా ఈమెపై విమర్శలు తగ్గుతాయా లేదా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొణె.. రెండోసారి ప్రెగ్నెన్సీ)

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)