Breaking News

ఎట్టకేలకు ఓటీటీలో 'అనగనగా ఒక రాజు'.. అఫీసియల్‌ ప్రకటన

Published on Fri, 02/06/2026 - 13:01

నవీన్‌ పొలిశెట్టి హీరోగా దర్శకుడు మారి తెరకెక్కించిన చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఇందులో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్  సంగీతం అందించారు.

థియేటర్‌ రన్‌ పూర్తి చేసుకున్న 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) మూవీ నెట్‌ఫ్లిక్స్‌(Netflix)లో విడుదల కానుంది. ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్‌ కానుందని యాప్‌లో ఆ ఓటీటీ సంస్థ పేర్కొంది. నవీన్‌ పొలిశెట్టి కామెడి పంచ్‌లకు ఫిదా అయిన ప్రేక్షకులు మరోసారి ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరి 13న ఓటీటీలోకి ఈ మూవీ రానుందంటూ పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, అంతకంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.

కథేంటంటే..
గౌరపురం జమీందారు గోపరాజు గారి మనవడు రాజు(నవీన్‌ పొలిశెట్టి)కి ‘జమీందారు’ అనే ట్యాగ్‌ తప్ప చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఉన్న ఆస్తులన్నీ తాత పరాయి స్త్రీలకు పంచడంతో పెద్ద పేరున్న పేదవాడిగా జీవితం గడుపుతుంటాడు. తన స్నేహితుడు ఒకడు ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకొని సెట్‌ అవ్వడంతో.. తాను కూడా బాగా డబ్బున్న అమ్మాయినే వివాహం చేసుకోవాలనుకుంటాడు. పెద్దపాలెం గ్రామానికి చెందిన భూపతి రాజు(రావు రమేశ్‌) బాగా రిచ్‌ అని తెలుసుకొని.. అతని కూతురు చారులత(మీనాక్షి చౌదరి)ని ప్రేమలో పడేస్తాడు. తాను కూడా బాగా ధనవంతుడని నమ్మించి.. పెళ్లి చేసుకుంటాడు. మొదటి రాత్రి రోజు రాజుకి ఓ షాకింగ్‌ న్యూస్‌ తెలుస్తుంది. అదేంటి? రాజు అనుకున్నట్లుగా భూపతి రాజు ఆస్తులన్నీ ఆయన చేతికి వచ్చాయా? చారులత కూడా రాజుని ఎందుకు ప్రేమించింది? జమీందారు అయిన రాజు.. పెద్దపాలెం ప్రెసిడెంట్‌గా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? ఎర్రిరాజు(తారక్‌ పొన్నప్ప)తో నవీన్‌కు ఎందుకు వైర్యం ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)