Breaking News

క్రికెట్‌ అంటే పిచ్చి.. కానీ ఆ నమ్మకంతో మిస్సవుతున్న అమితాబ్ !

Published on Mon, 10/02/2023 - 19:13

బాలీవుడ్‌లో బిగ్‌ బీ పేరున్న అమితాబ్ బచ్చన్‌ పేరు తెలియని వారు ఉండరు. దక్షిణాదిలోనూ ఆయనకు పెద్దసంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. వయసు పెరిగినా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కౌన్‌ బనేగా కరోడ్‌ పతి షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఇంతకీ ఏంటా విషయం తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉందా? అయితే చూసేద్దాం పదండి. 

(ఇది చదవండి: కృష్ణ తనయుడు రమేశ్ బాబు సినిమాల్లో ఎంట్రీ.. హీరోగా ఆ సినిమాతోనే!)

వాటిని కూడా నమ్ముతారా?

ఇప్పుడున్న కాలంలో మూఢనమ్మకాలు నమ్మేవారు ఉంటారంటే నమ్ముతారా? పైగా సెలబ్రిటీలు అలాంటి వాటిని విశ్వసిస్తారా?అస్సలు ఛాన్సే లేదు. నేను కూడా వాటిని నమ్మను. కానీ మన బిగ్‌ బీకి ఉన్న మూఢనమ్మకం గురించి తెలిస్తే నిజంగానే షాకవుతారు. ఎందుకంటే ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. ఇండియా మ్యాచ్‌ ఏదైనా సరే మిస్ కాకుండా చూడాల్సిందే. అలాంటి ఆ నమ్మకం వల్ల స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూసేందుకు వెళ్లరట.

(ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లండి'.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అఖిల్!)

అంతలా క్రికెట్‌ను అభిమానించే అమితాబ్‌ బచ్చన్ స్టేడియం వెళ్లి క్రికెట్ చూడనే చూడరు. ఎందుకంటే ఆయన కేవలం ఇంట్లోనే ఉండి లైవ్‌ మ్యాచ్‌ చూస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఆయన స్టేడియం వెళ్లి చూస్తే తన ఫేవరేట్‌ టీమ్ ఓడిపోతుందట. ఒకటి, రెండుసార్లు అలా జరగడంతో ఇక బిగ్‌ బీ మొత్తానికే స్టేడియ వెళ్లడం మానేశారట. ఆరు నూరైనా సరే ఇంట్లో ఉండే టీవీలో చూస్తారట. మరీ ఇప్పుడు ఇండియాలో వరల్డ్ కప్‌ జరుగుతోంది. మరీ ఈ మ్యాచ్‌లకైనా మూఢనమ్మకాన్ని పక్కనపెట్టి స్టేడియానికి వెళ్లి చూస్తారో లేదో? కొద్ది రోజులు వేచి చూద్దాం. అయినా సెలబ్రిటీలకు కూడా మూఢనమ్మకాలు ఉంటాయంటే నాలాంటి అభిమానులు నిజంగానే షాకవ్వాల్సిందే. 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)