Breaking News

వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఎంఎస్ ధోని నటి!

Published on Thu, 12/28/2023 - 07:55

ప్రముఖ బాలీవుడ్ నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఈ వేడుకలో స్విని ఖరా తన ప్రియుడిని పెళ్లాడింది. అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రంలో బాలనటిగా మెప్పించిన స్వీని ఖరా కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. జైపూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో ఉర్విష్ దేశాయ్‌తో ఏడడుగులు నడిచారు. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. పెళ్లికి సంబధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు.  

కాగా.. స్విని 2005లో విద్యాబాలన్ నటించిన పరిణీతతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. అదే ఏడాది టీవీ సీరియల్ బా బహూ ఔర్ బేబీలో కూడా నటించింది. అమితాబ్ బచ్చన్. టబు, పరేష్ రావల్ నటించిన చిత్రం చీనీ కమ్. ఈ చిత్రం‌లో స్వినీ ఖరా బాలనటుడిగా 'సెక్సీ' అనే పాత్రను పోషించింది.  ఆ తర్వాత ఆమె జాన్ అబ్రహం చిత్రం ఎలాన్, హరి పుత్తర్, షాహిద్ కపూర్ నటించిన పాఠశాల, ఢిల్లీ సఫారి, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రాల్లో కనిపించింది. అంతే కాకుండా ధరి కా వీర్ యోధా పృథ్వీరాజ్ చౌహాన్, దిల్ మిల్ గయే, సీఐడీ, జిందగీ ఖట్టి మీథీ వంటి షోలు చేసింది. ఆమె వృత్తిరీత్యా న్యాయవాది కాగా.. చదువుపై దృష్టి పెట్టేందుకు నటనకు స్వస్తి చెప్పింది.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)