Breaking News

సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది

Published on Mon, 05/12/2025 - 00:06

కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్‌ భారతదేశాన్ని కలచివేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పహల్గాం ఘటన, ఆపరేషన్‌ సిందూర్‌లపై ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘‘భార్యతో కలిసి వేసవి సెలవుల కోసం పహల్గాం వెళ్లిన భర్తను ఉగ్రమూక కాల్చి చంపింది.

తన భర్తను చంపవద్దని ఆ భార్య ఎంతగానో ఏడుస్తూ, ప్రాధేయపడినా ఆ ఉగ్ర ఉన్మాది వినలేదు. ఆమె కళ్ల ముందే భర్తను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఆమెను విధవరాలని చేశాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ భార్య... తనను కూడా చంపేయమని అడిగినా... ‘నిన్ను చంపను... వెళ్లి చెప్పుకో..’ అని ఆ రాక్షసుడు అన్నాడు. 

నా కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తుంటే .. ‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా... సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది’ అని మా నాన్న (హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌) రాసిన ఓ పద్యంలోని వాక్యం నాకు గుర్తొచ్చింది. అందుకే నేను నీకు సిందూరం ఇస్తున్నా... అపరేషన్‌ సిందూర్‌... జై హింద్‌... భారత సైన్యమా... ఎప్పటికీ ఆగకు... వెనకడుగు వేయకు’’ అంటూ  భావోద్వేగమైన ΄పోస్ట్‌ను షేర్‌ చేశారు అమితాబ్‌ బచ్చన్‌.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)